Vemireddy Prashanthi Reddy : వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరారు .. కాసేపటికే బిగ్ షాక్..!!
ప్రధానాంశాలు:
Vemireddy Prashanthi Reddy : వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరారు .. కాసేపటికే బిగ్ షాక్..!!
Vemireddy Prashanthi Reddy : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రభావం చూపగల రాజకీయ నాయకులలో వేమిరెడ్డి కుటుంబం ఒకటి. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం ఫ్యామిలీ పార్టీ వదిలి వెళ్ళిపోతున్న తరుణంలో రాజ్యసభ టికెట్ ఇస్తామని చెప్పినా పార్టీని వీడుతామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీసుకున్న అతిపెద్ద నిర్ణయం టీడీపీ లో జాయిన్ అవ్వడం. వైఎస్ జగన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టీటీడీలో కీలకమైన పదవి ఇచ్చారు. అయినా కూడా ఆమె దానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ లోకి చేరారు. ఇక టీడీపీ నెల్లూరు ను క్లీన్ స్వీప్ గా ఓడిస్తామని చెప్పడంతో వేమిరెడ్డి ఫ్యామిలీ టీడీపీలోకి చేరినట్లు టాక్ వినిపిస్తుంది. మరోపక్క పల్నాడు జిల్లాలో లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి జాయిన్ అవ్వబోతున్నట్లు సమాచారం. అలాగే వసంత కృష్ణ ప్రసాద్ కూడా టీడీపీలోకి చేరారు.
ఈ మూడు చీలికలు కూడా వైసీపీకి గట్టి షాక్ అని చెప్పాలి. లావు కృష్ణదేవరాయకు ఎంపీ టికెట్ ఇస్తామని అది వేరే చోట ఇస్తామని చెప్పిన ఆయన అందుకు అంగీకరించకపోవడంతో టీడీపీ లోకి చేరారని అంటున్నారు. వేమిరెడ్డి కి రాజ్యసభ టికెట్ ఇస్తామన్నా, కాదనుకొని టీడీపీలోకి చేరడం వైసీపీకి పెద్ద షాక్ అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు కలిసి పని చేయబోతున్నారని టీడీపీ నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక వేమిరెడ్డి కుటుంబానికి వైయస్ జగన్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే ఎందుకు ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ వచ్చిందని చర్చనీయాంశంగా మారింది. వేమిరెడ్డి పార్టీని విడిపోయినప్పుడు వైయస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని పార్టీ శ్రేణులు అంటున్నారు. వేమిరెడ్డి కోసం వైయస్ జగన్ అనిల్ యాదవ్ ను నర్సాపురం కి షిఫ్ట్ చేయాల్సింది పరిస్థితి వచ్చింది అయినా కూడా వేమిరెడ్డి పార్టీని వీడడంతో వైయస్ జగన్ తీవ్ర ఆవేదన చెందడం జరిగింది.
అందుకే విజయసాయిరెడ్డిని నెల్లూరు నుంచి పోటీ చేయించడానికి వైసీపీ ఇటీవల ప్రకటించింది కూడా . ఇటువంటి పరిస్థితుల్లో నెల్లూరు ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు అనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే పార్టీ మారిన వాళ్ళకి లోకల్ క్యాడర్ నుంచి అనుకూలత లేదని అంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనుచరులు, పార్టీ కార్యకర్తలు టీడీపీలోకి చేరమని వైసీపీలోనే ఉంటామని కరాకండిగా చెబుతున్నారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఇబ్బందిగా మారింది. తమ క్యాడర్ పార్టీ కార్యకర్తలు తమతోపాటు టిడిపిలోకి వస్తారని అనుకున్న తరుణంలో క్యాడర్ కార్యకర్తలు వైసీపీలోనే ఉంటామని కరాకండిగా తేల్చి చెప్పారు దీంతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెద్ద షాక్ తగిలినట్లు అయింది.