Venu swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలు చెప్పిన వేణు స్వామి తాజాగా ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జాతకం గురించి తెలిపారు. 2024లో, 2029 లో మళ్లీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తారని ఆయనను విమర్శించినన్నినాళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. 2024 లో కేసీఆర్ లాగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి మారబోతున్నారని వేణు స్వామి అన్నారు. ఇక షర్మిల జాతకరీత్యా తన అన్నకు వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నారని అన్నారు.
ఏపీలో తన అన్న వెంట షర్మిల ఉంటే ఎంపీ సీటు వచ్చేది, రాజయోగం పట్టేది. కానీ ఆమె అందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. ఆమె సొంతంగా పార్టీ పెట్టడం వలన తెలంగాణలో ఎటువంటి ఉపయోగం కలగలేదు. ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటినుంచి ఆమె ప్రభావం ఎంత మాత్రం ఉండదని అన్నారు. ఇప్పుడు కూడా వై.యస్.షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినంత మాత్రాన ఆమె ప్రభావం ఏమాత్రం ఉండదని అన్నారు. సీఎం చెల్లిగా ఆమె కష్టాలు పడాల్సిన అవసరం లేదని లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఆమె తీసుకుంటున్న నిర్ణయాల వలన ఆమె చాలా కష్టపడుతున్నారు కానీ ఫలితం దక్కదు అని వేణు స్వామి అన్నారు.
ఇక వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఏపీలో మూడు సార్లు సీఎం గా పదవి చేపడతారని, 2024, 2029 ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. టీడీపీ పార్టీకి అంతగా ప్రాముఖ్యత ఉండదని అన్నారు. జగన్ ను విమర్శించిన వాళ్లు ఆయనే సీఎం గా ఉంటారని అన్నారు. 2024లో కేసీఆర్ లాగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి మారబోతున్నారని స్వామి అన్నారు. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కి ముఖ్యమంత్రి యోగం లేదని, ఎమ్మెల్యేగా గెలుస్తారని వేణుస్వామి అన్నారు. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల వేణు స్వామి చెబుతున్న జాతకాలు బెడిసి కొడుతున్నాయి. ప్రభాస్ కెరియర్ డౌన్ అవుతుందని, తెలంగాణలో మళ్లీ కేసిఆర్ వస్తారని చెప్పారు. కానీ ప్రభాస్ సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. అయినా కూడా వేణు స్వామి వాటన్నింటినీ కవర్ చేస్తూ మళ్ళీ జాతకాలు చెబుతూనే ఉన్నారు
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.