YS Jagan : అమరావతికి మరో షాక్ .. ఏపీకి మూడు కాదు.. నాలుగు రాజధానులు ?
YS Jagan : అదేంటి.. మూడు రాజధానులంటేనే ఏపీ ప్రజలు భగ్గుమంటున్నారు. అమరావతి ఉద్యమం తారాస్థాయిలో ఉంది. ఈ సమయంలో మరో రాజధానిని సీఎం జగన్ ప్రకటించారా? అసలు ఎప్పుడు ఇదంతా జరిగింది అంటారా? ఆయన అఫిషియల్ గా నాలుగో రాజధానిని ప్రకటించలేదు కానీ.. వెటర్నరీ, బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ను పులివెందులకు తరలించి.. ఏపీకి నాలుగో రాజధానిని ప్రకటించినంత పని చేశారు అని అంటున్నారు రాజకీయ వేత్తలు.
ఎందుకంటే.. ఇప్పటికే అమరావతి నుంచి ఒక్కో కార్యాలయం విశాఖకు తరలిపోతోంది. ఓవైపు ఇంకా రాజధానుల అంశం కోర్టులో నానుతున్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు ప్రభుత్వ ఆఫీసులను తరలిస్తోంది. ఇప్పటికే మెట్రో కార్యాలయం కూడా విశాఖకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది.
తాజాగా.. కడప జిల్లా పులివెందులకు వెటర్నరీ, బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అసలు.. పులివెందులకు ఆ ఇన్ స్టిట్యూట్ ను తరలించడానికి కారణం.. పులివెందుల.. సీఎం జగన్ సొంత నియోజకవర్గం. నిజానికి.. ఈ ఇన్ స్టిట్యూట్ ను కంకిపాడులో ఏర్పాటు చేసేందుకు గత సంవత్సరం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పశుసంవర్థక మంత్రి ఈ కార్యాలయాన్ని కంకిపాడులో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అన్నీ ఏర్పాటు కూడా చకచకా జరిగిపోయాక… చివరి నిమిషంలో ఆ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు ఆగిపోయింది.
కట్ చేస్తే.. ప్రస్తుతం కంకిపాడు కాదని… ఇన్ స్టిట్యూట్ ను పులివెందులకు తరలిస్తున్నారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ చెప్పినట్టుగానే.. పులివెందులకు ఈ ఇన్ స్టిట్యూట్ ను తరలిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
YS Jagan : త్వరలో మరిన్ని సంస్థలు పులివెందులకు?
ఈ ఒక్క ఇన్ స్టిట్యూట్ పులివెందులకు తరలిస్తే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ.. త్వరలోనే మరికొన్ని సంస్థలను కూడా పులివెందులకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. విశాఖకు సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తే ఓకే కానీ.. పులివెందులకు ఎందుకు తరలిస్తున్నట్టు.. అంటూ ఏపీ ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
సీఎం జగన్.. ఇన్ డైరెక్ట్ గా ఏపీకి నాలుగో రాజధాని పులివెందులను ప్రకటించారని.. పులివెందులను కూడా ఏపీ రాజధానిగా భావించి.. కార్యాలయాలను తరలిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అయినప్పటికీ.. అది మొదటిదని.. రెండో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పులివెందుల అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా.. పులివెందులను ఏపీ క్యాపిటల్ గా ఏపీ ప్రజలు స్వీకరిస్తారా? లేదా? అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.