Vijayasai Reddy : వైసీపీలో విజయసాయిరెడ్డి పొజిషన్ డౌన్ ఫాలో అవుతుందా..? జగన్ పక్కకు పెడుతున్నాడా…?
Vijayasai Reddy : ప్రస్తుతం వైసీపీలో ఏం జరుగుతోంది. వైసీపీలో నెంబర్ వన్ ఎవరు అంటే సీఎం జగన్ అనే చెప్పుకోవాలి. ఇక నెంబర్ 2 మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కొన్నేళ్ల పాటు నెంబర్ 2 స్థానంలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. కానీ.. ఇప్పుడు ఆ స్థానంలో విజయసాయిరెడ్డి లేరు. ముందు ఆ స్థానంలో చాలామంది ఉండేవారు. ఒక కొణతల రామకృష్ణ, గోనె ప్రకాశ రావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఇలా చాలామంది నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నవాళ్లే. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి తర్వాత ఇప్పుడు నెంబర్ 2 స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు.
అంటే ఏమాత్రం తోక జాడిచ్చినా నెంబర్ 2 స్థానం అనేది మారిపోతుంది అన్నమాట. అయితే.. ప్రస్తుతం తన పొజిషన్ ఏంటి అనేది విజయసాయిరెడ్డికే అంతుపట్టడం లేదు. ప్రస్తుతం తన చేతిలో ఒక రాజ్యసభ పదవి మాత్రమే ఉంది. ఆ పదవి ఉంది కాబట్టే అంతో ఇంతో ఇప్పుడు గౌరవం. నిజానికి వైసీపీ ఎదుగుదలలో విజయసాయిరెడ్డి కీలక వ్యక్తిగా ఉన్నారు. వైసీపీని తన సొంత పార్టీలా చూసుకున్నారు. జగన్ ఏది చెబితే అది చేసేవారు. పార్టీలో చాలా ముఖ్య నేతగా ఉన్న విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఇలా ఎందుకు అయింది అనేది అంతుపట్టడం లేదు.
Vijayasai Reddy : కీలక నేత నుంచి సామాన్య కార్యకర్తగా మారిన విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి కీలక నేత నుంచి సామాన్య కార్యకర్తగా మారారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యతల నుంచి కూడా విజయసాయిరెడ్డిని తప్పించారు. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ఆ బాధ్యతలను చూసుకుంటున్నారు. సోషల్ మీడియా విభాగాన్ని కూడా సజ్జల కొడుకు చూసుకుంటున్నారు. ఇక.. అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతను చెవిరెడ్డికి ఇచ్చారు ముఖ్యమంత్రి. వీటన్నింటి విషయంలో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టడంతో విజయసాయి కొంచెం హర్ట్ అయినట్టే అనిపిస్తోంది. ఏది ఏమైనా.. వైసీపీ పార్టీపై, జగన్ పై ఉన్న అభిమానంతో విజయసాయి ఏం మాట్లాడటం లేదు కానీ.. ఆయన్ను జగన్ ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అనేది మాత్రం అంతుపట్టడం లేదు.