AP Ration : లబ్దిదారులకు శుభవార్త.. ఇక నుండి రేషన్‌లో అవికూడా !!
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, కొంతమంది లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఏటీఎం సైజులో ఉండే ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ సదుపాయం కల్పించారు. రేషన్ తీసుకున్న వెంటనే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం చేరేలా టెక్నాలజీ వినియోగం జరుగుతోందని మంత్రి వివరించారు.

wheat distribution in ration card holders
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పేదలకు మరో శుభవార్త తెలిపారు. త్వరలో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలను కూడా అందజేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు రేషన్‌లో బియ్యం మాత్రమే క్రమం తప్పకుండా అందుతున్నా, కందిపప్పు, పంచదార సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో గోధుమలను అందించడం ద్వారా ప్రజలకు మరో ఆప్షన్ లభిస్తుందని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 15 నాటికి రాష్ట్రంలోని 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని కూడా స్పష్టం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం కూడా రేషన్‌లో కొన్ని వస్తువులు ఇవ్వడానికి ప్రయత్నించినా అవి క్రమం తప్పకుండా అందలేకపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా రాగులు ఇవ్వాలనుకున్నా, ధరలు ఎక్కువగా ఉండటంతో ఆ ఆలోచన ఆగిపోయినట్లు కనిపిస్తోంది. అయితే, కేంద్రం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో గోధుమలను అందజేస్తున్నందున, ఏపీలో కూడా వాటిని అందించే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ దుకాణాల సంఖ్య పెంపుతో పాటు సబ్డిపోలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.