YS Vijayamma : ఎన్నికల బరిలోకి వైఎస్ విజయమ్మ.. ఎటు నుంచి పోటీ చేయబోతున్నారు ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Vijayamma : ఎన్నికల బరిలోకి వైఎస్ విజయమ్మ.. ఎటు నుంచి పోటీ చేయబోతున్నారు ..?

 Authored By tech | The Telugu News | Updated on :4 March 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Vijayamma : ఎన్నికల బరిలోకి వైఎస్ విజయమ్మ.. ఎటు నుంచి పోటీ చేయబోతున్నారు ..?

YS Vijayamma  : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ని గద్దె దించడానికి ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. ఇక వైఎస్ జగన్ చెల్లెలు వైయస్ షర్మిల కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో వైఎస్ కుటుంబం సంచలనగా మారిందనే చెప్పాలి. వైఎస్ జగన్ అధికార పార్టీలో ఉండగా ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ప్రతిపక్షం వైపు ఉన్నారు. ఇక వారి తల్లి వైఎస్ విజయమ్మ ఎవరికి సపోర్ట్ ఇవ్వాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అయితే వైయస్ విజయమ్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గతంలో తెలంగాణలో పార్టీ పెట్టిన వైయస్ షర్మిలకు సపోర్టుగా వైఎస్ విజయమ్మ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొడుకు, కూతురు మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో ఎవరి వైపు నిలబడతారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మొన్నటిదాకా తన మనవడు వైయస్ రాజారెడ్డి పెళ్లి బిజీలో ఉన్న వైఎస్ విజయమ్మ ఇప్పుడు రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని చర్చ నడుస్తుంది. జమ్మలమడుగు లేదా వైజాగ్ నుంచి ఎంపీగా వైఎస్ విజయమ్మను పోటీ చేయించాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లిని రిక్వెస్ట్ చేశారని అంటున్నారు. గతంలో చాలా సంవత్సరాలు వైయస్ విజయమ్మ వైసీపీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ తర్వాత దానికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ఆమె వైసీపీ పార్టీ తరపున ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. అయితే దీనికి వైయస్ షర్మిల విముఖత చూపిస్తున్నారని అంటున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో దూసుకెళుతున్న వైయస్ షర్మిల తన తల్లి తనకు సపోర్టుగా ఉంటారు అనుకోవడంలో తప్పు లేదని అంటున్నారు.

అయితే ఇప్పుడు వైయస్ విజయమ్మ తన కొడుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అయితే ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక ఎంపీగా పోటీ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో వైసీపీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ దానికి రాజీనామా చేసి తన కూతురు తెలంగాణలో వైయస్సార్ టీపీ పార్టీని స్థాపించారని అక్కడ సపోర్ట్ చేశారు. అప్పుడు కొడుకు ఆంధ్రప్రదేశ్లో, కూతురు తెలంగాణలో పార్టీ ఉండడం వలన ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పుడు ఒకే రాష్ట్రంలో ఇద్దరు వేరువేరు పార్టీలో ఉన్నందువలన వైయస్ విజయమ్మకు ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఆమె తన కొడుకు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు వైయస్ షర్మిల అందుకు విముఖత చూపుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో వైఎస్ విజయమ్మ ఎవరికి సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా ఉండవచ్చు అని కొందరు అంటున్నారు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది