Andra Pradesh Election : టిడిపి వర్సెస్ వైసీపీ… మే లో ఎలక్షన్స్… లాభం ఎవరికి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Andra Pradesh Election : టిడిపి వర్సెస్ వైసీపీ… మే లో ఎలక్షన్స్… లాభం ఎవరికి…?

Andra Pradesh Election : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతా సందడి నెలకొంది. మే నెలలో మూడో వారంలో ఎలక్షన్స్ జరగనున్నాయి. వాస్తవానికి ఇలా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మొదటి రెండు దశలోనే పోలింగ్ నడిచేది.. అయితే ఇప్పటికి 20 ఏళ్ల క్రితం చూస్తే ఇదే జరిగింది. 2004లో ఏప్రిల్ 26న మొదటి దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 21న ఎంపీ సీట్లు. అలాగే రెండవ దశలో ఏప్రిల్ 26 ఉమ్మడి […]

 Authored By tech | The Telugu News | Updated on :17 March 2024,8:30 pm

ప్రధానాంశాలు:

  •  Andra Pradesh Election : టిడిపి వర్సెస్ వైసీపీ... మే లో ఎలక్షన్స్... లాభం ఎవరికి...?

Andra Pradesh Election : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతా సందడి నెలకొంది. మే నెలలో మూడో వారంలో ఎలక్షన్స్ జరగనున్నాయి. వాస్తవానికి ఇలా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మొదటి రెండు దశలోనే పోలింగ్ నడిచేది.. అయితే ఇప్పటికి 20 ఏళ్ల క్రితం చూస్తే ఇదే జరిగింది. 2004లో ఏప్రిల్ 26న మొదటి దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 21న ఎంపీ సీట్లు. అలాగే రెండవ దశలో ఏప్రిల్ 26 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంకో 21 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగింది. ఇక దాంతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయిపోయాయి. మే 13న కౌంటింగ్ జరిగింది. మే 16న అప్పటికి కాంగ్రెస్ సీఎంగా వైఎస్సార్ అధికారంలోకి రావడం జరిగింది. అలాగే 2009లో తీసుకున్న ఏప్రిల్ 16 ఏప్రిల్ 23 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతట పోలింగ్ పూర్తయింది. 2014లో కూడా తెలంగాణలో ఏప్రిల్ 30న పోలింగ్ ముగిసింది.ఆంధ్రప్రదేశ్లో మే 7న పోలింగ్ జరిగింది. ఇక 2019లో చూస్తే మొదటి దశలో ఏప్రిల్ 11న పోలింగ్ అయితే ముగిసింది.

కానీ 2024 లో మాత్రం ఏకంగా మే 13న పోలింగ్ ఉండబోతోంది. పోలింగ్ తేదీ ఎంత సుదీర్ఘంగా ఉండడం ఎవరికీ లాభం అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా ఎంతో కొంత విపక్ష ఓటమికి మేలు అన్న విశ్లేషణ అయితే వినపడుతోంది. ఎందుకంటే వైసిపి నాలుగు సిద్ధం సభలతో జోరు మీద నడుస్తోంది. అదేవిధంగా అభ్యర్థులని పూర్తిగా ప్రకటించేసింది. అలాగే జగన్ కూడా ఎలక్షన్ల ప్రచారానికి రెడీగా ఉన్నాడు. దాంతో విపక్ష కూటమికి కావలసినంత టైం దొరుకుతుంది. అందర్నీ దగ్గర కూర్చోబెట్టుకొని సర్ది చెప్పుకొని ఐక్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. షెడ్యూల్ విడుదలయ్యింది. కాబట్టి సీఎం లు మంత్రులు అంత నామమాత్రం అయిపోయారు. వారు ఏమీ ఆదేశాలు ఇవ్వలేదు. అధికారాలు ఏమీ లేవు..దాంతోపాటుగా ప్రభుత్వం మీద వివిధ రంగాలలో ఉన్న వ్యతిరేకత నెమ్మదిగా బయటికి వస్తుంది. దాన్ని రప్పించే ప్రయత్నం విపక్ష అవుతుంది.

అదేవిధంగా చూస్తే మార్చిలోనే ఎండలు ఇరగదీస్తున్నాయి. అదే మేలో అయితే కరెంటు కష్టాలు నీటి కష్టాలు శ్రావణి కూడా కలిసి అధికారిక పార్టీ మీద వ్యతిరేకతను ఎంతో కొంత ఉంటుందని అంటున్నారు. వైసిపి ఎద్దులకు పై వ్యక్తి వేసేందుకు బిజెపితో ఓరి టీడీపీ పొత్తు పెంచుకుంటుందని చెప్తున్నారు. అదే తీరున వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టిడిపి పెద్దలు ఆరు తేరి ఉన్నారు. మొత్తానికి ఇవన్నీ చూస్తే కనుక వైసిపికి ఇబ్బంది ఉంటుందా అనే చర్చ నడుస్తోంది.. అయితే ఒక టీవీ డిబేట్లో పాల్గొన్న వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ విపక్షానికి ఎంత టైం ఇచ్చినా వారిది ఓటమి కూటమి తప్ప గెలిచేది ఉండదు అని చెప్పారు. ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారని దాని వలన ఏప్రిల్ లో అయినా మేలు అయిన మేమే గెలిచి తీరుతామని మంత్రి వెల్లడించారు. అయితే 2014లో మే 7న ఎన్నికల జరిగితే టిడిపి గెలిచింది. అదే 2004, 2009 ,2019లో ఏప్రిల్ లో జరిగితే ఓడిపోయింది. దాని వలన మే నెల టిడిపికి సెంటిమెంట్ కావున గెలుస్తారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.. ఈ మే నెలలో ఎన్నికలు ఎవరికి లాభం జరుగుతుందో చూడాలి మరి…

Also read

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది