Election : తెలంగాణ లో మరోసారి ఎన్నికల పండగ..!
ప్రధానాంశాలు:
Election : తెలంగాణ లో మరోసారి ఎన్నికల పండగ..!
Election : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడి పుంజుకుంటున్నాయి. మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ, సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత కేసు తీర్పు రిజర్వ్ అయిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ దృశ్యం మరింత ఆసక్తికరంగా మారింది. ఇటు కేసీఆర్ తన పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. ఎన్నికల వ్యూహాలపై చర్చలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఎన్నికల సమరానికి సిద్ధమవుతుండటంతో, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పండగ మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Election : తెలంగాణ లో మరోసారి ఎన్నికల పండగ..!
Election కాంగ్రెస్ స్థానిక ఎన్నికలు కలిసొస్తాయా..?
ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరిపేందుకు రేవంత్ సర్కారు యోచనలో ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలకు ముందుగా ఎన్నికలు నిర్వహించి, అనంతరం సర్పంచ్ ఎన్నికలు చేయాలని ఒక ప్లాన్ రూపొందిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ముందుగా సర్పంచ్ ఎన్నికలే నిర్వహించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినప్పటికీ, కొత్త ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం విడుదల చేయాల్సిన నిధులు నిలిచిపోయాయని వారు చెబుతున్నారు.
ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లులు అసెంబ్లీలో ఆమోదించినప్పటికీ, అవి పార్లమెంటులో చర్చకు రాలేదు. గవర్నర్ ఆమోదం కోసం బిల్లులు పంపారు. కానీ అవి ఇంకా పూర్తి ప్రక్రియలోనే ఉన్నందున, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే గతంలో అమలైన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటూ, స్పష్టత వచ్చిన వెంటనే అధికారికంగా ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఏదేమైనా, తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడి పుంజుకుంటుండగా, ప్రజలకు ఓటు హక్కు వినియోగించే సమయం దగ్గర పడుతోంది.