Chandrababu : చంద్రబాబు మీద తిరగబడిన సొంత కార్యకర్తలు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : చంద్రబాబు మీద తిరగబడిన సొంత కార్యకర్తలు !

 Authored By kranthi | The Telugu News | Updated on :30 May 2023,8:00 pm

Chandrababu : ఇటీవల జరిగిన మహానాడులో చంద్రబాబు చాలా ఉత్సాహంగా కనిపించారు. అంతే కాదు.. ఆయన మహానాడు వేదిక మీదే ఏపీ ప్రజలకు చాలా హామీలు గుప్పించారు. మామూలుగా కాదు.. ఓ రేంజ్ లో హామీలు గుప్పించారు. ఎక్కువగా మహిళలకు లబ్ది చేకూరేలా.. మహిళా సాధికారతకు ఉపయోగపడేలా చంద్రబాబు పలు హామీలను ఇచ్చారు. ఒకప్పుడు ఊరికే డబ్బులు ఇచ్చేసి అదే అభివృద్ధి అనుకుంటే ఎలా అని అన్న చంద్రబాబు ఇప్పుడు అలాంటి హామీలనే ప్రకటించడంపై టీడీపీ నేతలు, రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

why chandrababu is neglecting tdp cadre

why chandrababu is neglecting tdp cadre

ఇవన్నీ పక్కన పెడితే అసలు పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల గురించి చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్లను ఎందుకు చంద్రబాబు పట్టించుకోవడం లేదు అనేది ఇప్పుడు అంతుపట్టడం లేదు. ఇప్పటికే మొదటి మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు త్వరలోనే రెండో మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నారు. అందులో రైతుల గురించి పలు సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మహానాడు ముగిశాక.. తిరిగి వెళ్తుండగా రాజమండ్రి విమానాశ్రయంలో చంద్రబాబును టీడీపీ కార్యకర్తలు కలిశారు. ఈసందర్భంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబుకు చెప్పారు.

Chandrababu varupula satyaprabha is new tdp incharge for prathipadu

Chandrababu varupula satyaprabha is new tdp incharge for prathipadu

Chandrababu : కార్యకర్తల సమస్యలను పట్టించుకోని చంద్రబాబు

ధాన్యం కొనుగోలు అంశంలోనూ వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చంద్రబాబుతో మొర పెట్టుకున్నారు. దీంతో చంద్రబాబు కార్యకర్తల సమస్యలపై అంతగా స్పందించలేదు. కానీ.. రెండో మేనిఫెస్టోలో రైతులకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలను అమలు చేద్దాం అని చెప్పి అఅక్కడి నుంచి వెళ్లిపోయారు కానీ.. చంద్రబాబు కార్యకర్తల సమస్యలను మాత్రం పట్టించుకోలేదు. అసలు పార్టీకి పట్టుగొమ్మలే కార్యకర్తలు. కానీ.. వాళ్ల సమస్యలను పట్టించుకోకుండా చంద్రబాబు అలా మాట దాటేయడం ఏంటి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు.. ధాన్యం కొనుగోలు అంశంపై ఎందుకు చంద్రబాబు మాట్లాడలేకపోతున్నారు. రైతులకు ఏదో మేలు చేస్తా అనే చంద్రబాబు.. ఎందుకు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదంటూ ప్రశ్నించారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది