Chiranjeevi : అసలు చిరంజీవి ఎందుకు ఢిల్లీ వెళ్లినట్టు.. బాబోయ్.. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?
Chiranjeevi : బాబోయ్… ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ముందు తెలంగాణలో ఎన్నికలు అయిపోవాలి. ఇక్కడ ఫలితాలు రావాలి. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం కదా ఏపీలో ఎన్నికల హడావుడి ప్రారంభం అయ్యేది. కానీ.. అసలు ముందే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయా అన్నట్టుగా ఉంది అక్కడి వ్యవహారం చూస్తే. అవును.. ఏపీలో ఎన్నికల హడావుడి ఎప్పుడో మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం ఎప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాయి. ఫిరాయింపులు, జంపింగ్ లు, టికెట్ల లొల్లి స్టార్ట్ అయింది.
ఇదంతా పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో బాగా చర్చనీయాంశం అవుతున్నారు. నిజానికి రాజకీయాలు ఆయన వదిలేసి చాలా ఏళ్లు అవుతోంది. అయినా కూడా ఇంకా రాజకీయాల్లో ఆయన పేరు వినిపించడం విచిత్రంగా ఉంటుంది. కానీ.. ఇటీవల వాల్తేరు వీరయ్య 200వ రోజు వేడుకల్లో ఆయన ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయాల్లో ఆయన టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.
Chiranjeevi : అందుకే మెగాస్టార్ ఢిల్లీ వెళ్లారా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఇటీవలే విడుదలైంది. విజయవంతంగా నడుస్తోంది. అయితే.. తన సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి ఎక్కడికో వెళ్లారట. ఏదైనా హాలీడే ట్రిప్ కు వెళ్లారా అనుకుంటే అదీ కాదట. ఆయన ఢిల్లీకి వెళ్లారు అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కాకపోతే ఢిల్లీకి ఆయన ఏదో రాజకీయాల గురించి చర్చించడానికి కాదట. చాలామంది ఢిల్లీ అనగానే రాజకీయాల గురించి అనుకుంటారు కానీ.. ఆయన ఢిల్లీకి వెళ్లింది పర్సనల్ టూర్ మీద అట. వారం రోజుల పాటు చిరంజీవి ఢిల్లీలోనే ఉంటారట. ఆ తర్వాత ఆయన పుట్టిన రోజు సమయం వరకు బెంగళూరుకు వస్తారని తెలుస్తోంది. అయితే.. ఆయన నిజంగానే పర్సనల్ పని మీద ఢిల్లీ వెళ్లారా? లేక అక్కడ రాజకీయాలు ఏమైనా చేస్తున్నారా? కేంద్రంతో ఏమైనా మంతనాలు చేస్తున్నారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.