Wife Killed Husband : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..ఆ శవం పక్కనే అశ్లీల వీడియోలు చూస్తూ ఎంజాయ్
Wife Killed Husband : ఇటీవల వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న భర్త /భార్య ఉండగానే మరొకరితో సంబంధం పెట్టుకొని కట్టుకున్న తమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారని కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో వెలుగుచూసిన దారుణ హత్యోదంతం వివాహేతర సంబంధాలు ఎంతటి ఘోరాలకు దారితీస్తాయో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది. 2007లో వివాహం చేసుకున్న శివనాగరాజు(45), లక్ష్మీ మాధురి దంపతులు మొదట్లో సాఫీగానే గడిపినప్పటికీ, మాధురికి విజయవాడలోని ఒక థియేటర్‌లో పనిచేసే సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో ఏర్పడిన పరిచయం వీరి సంసారంలో చిచ్చుపెట్టింది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డురాకుండా ఉండేందుకు మాధురి అత్యంత కిరాతకమైన ప్లాన్ వేసింది. తన భర్తను ప్రియుడి వద్దకే డ్రైవర్‌గా పంపడం, ఆపై హైదరాబాద్‌లో వీరి వ్యవహారం బయటపడి మందలించినా వినకుండా, భర్త ప్రాణాలు తీయడమే పరిష్కారమని భావించడం ఆమె క్రూరత్వానికి పరాకాష్ట.
Wife Killed Husband : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..ఆ శవం పక్కనే అశ్లీల వీడియోలు చూస్తూ ఎంజాయ్
జనవరి 18న జరిగిన ఈ హత్యలో నిందితులు అత్యంత పకడ్బందీగా వ్యవహరించారు. భర్తకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి, ఆయన స్పృహ కోల్పోయిన తర్వాత ప్రియుడు గోపితో కలిసి మాధురి హత్యకు పాల్పడింది. అయితే ఈ ఘటనలో అత్యంత విస్మయకరమైన విషయం ఏమిటంటే, భర్తను చంపిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా రాత్రంతా నీలి చిత్రాలు చూస్తూ గడపడం ఆమె వికృత చేష్టలను తెలియజేస్తోంది. మరుసటి రోజు ఉదయం ఏమీ ఎరుగనట్లు తన భర్తకు గుండెపోటు వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేసి, సహజ మరణంగా చిత్రీకరించేందుకు నాటకమాడింది.
కానీ శివనాగరాజు మృతదేహంపై ఉన్న గాయాలు, మాధురి గత ప్రవర్తనపై కుటుంబ సభ్యులకు ఉన్న అనుమానాలు ఆమె పాపాన్ని పండించాయి. మృతుడి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మాధురి అసలు నిజాన్ని ఒప్పుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భర్తను చంపినట్లు ఆమె అంగీకరించింది. ప్రస్తుతం మాధురి పోలీసుల అదుపులో ఉండగా, పరారీలో ఉన్న ప్రియుడు గోపి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. క్షణికానందం కోసం కట్టుకున్న భర్తను బలితీసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.