Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?
ప్రధానాంశాలు:
జనసేన సపరేట్ అవుతుందా..?
Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే పేరుతో ఇంటింటికీ వెళ్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ నేతలంతా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందన్న సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ చర్యపై రాజకీయంగా విపక్షాల నుంచి విమర్శలు వస్తుండగా, సామాజికంగా కూడా కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి.

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?
Janasena : టీడీపీ తర్వాత జనసేన వంతు..!!
ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న కూటమి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఏర్పరచిన ప్రభుత్వం. అలాంటప్పుడు కేవలం టీడీపీ మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఏ మేరకు సమంజసం? మూడు పార్టీలూ కలిసి ఎన్నికలుకు ముందుగా ప్రచారం చేశాయి. ఇప్పుడూ పాలనలో భాగస్వాములే. మరి ఈ ఒక్క పార్టీ ఎందుకు ప్రచారం చేస్తుంది..? మిగతా రెండు పార్టీలు ఎందుకు దూరంగా ఉంటున్నాయి..? అని అంత మాట్లాడుకుంటున్నారు.
ఇక జనసేన మాత్రం ప్రత్యేక కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ శాఖల్లో చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకూ తెలియజేయాలన్న ఉద్దేశంతో తాము ప్రజల మధ్యకు వేరే కార్యక్రమంతో వస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామీణాభివృద్ధి, రేషన్ సరఫరా, పంచాయతీలకు నిధుల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వంటి అంశాలను తమ క్రెడిట్‌గా ప్రస్తావిస్తున్నారు. అందుకే టీడీపీ పూర్తి చేసిన తర్వాత జనసేన పార్టీ మరో విడత కార్యక్రమాలతో ప్రజలలోకి వెళ్లేలా వ్యూహం సిద్ధం చేస్తోందట. దాంతో ఇప్పటికి టీడీపీ ఒంటరిగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.