Post Office : ఏపీలో పోస్టాఫీసుల‌కి ప‌రుగులు పెడుతున్న మ‌హిళ‌లు.. కార‌ణం ఏంటంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Post Office : ఏపీలో పోస్టాఫీసుల‌కి ప‌రుగులు పెడుతున్న మ‌హిళ‌లు.. కార‌ణం ఏంటంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 November 2024,7:30 pm

ప్రధానాంశాలు:

  •  Post Office : ఏపీలో పోస్టాఫీసుల‌కి ప‌రుగులు పెడుతున్న మ‌హిళ‌లు.. కార‌ణం ఏంటంటే..!

Post Office : ఏపీలోని ప‌లు జిల్లాల‌లో మ‌హిళ‌లు పోస్టాఫీసుల‌కి ప‌రుగులు పెడుతున్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలుతో పాటుగా పలు జిల్లాల్లో పోస్టాఫీసుల దగ్గర రద్దీ ఉంది.. ఎక్కడ చూసినా మహిళలే ఎక్కువమంది కనిపిస్తున్నారు. ఇలా మహిళలకు పోస్టాఫీసుల దగ్గరకు వెళ్లడానికి కారణాలు ఏంటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు ఎక్కడ రావోననే భయంతోనే వీళ్లంతా పోస్టాఫీసుల దగ్గరకు వెళుతున్నట్లు తేలింది. ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ చెప్పుకోదగిన స్ధాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలెండర్లు మినహా మిగతా పథకాల ఊసెత్తడం లేదు. దీంతో ప్రభుత్వంపై పథకాల అమలుపై ఒత్తిడి పెరుగుతోంది.

Post Office ఏపీలో పోస్టాఫీసుల‌కి ప‌రుగులు పెడుతున్న మ‌హిళ‌లు కార‌ణం ఏంటంటే

Post Office : ఏపీలో పోస్టాఫీసుల‌కి ప‌రుగులు పెడుతున్న మ‌హిళ‌లు.. కార‌ణం ఏంటంటే..!

Post Office అస‌లు విష‌యం ఇది..!

ఇప్పటి వరకూ బ్యాంకుల్లో సేవింగ్ అకౌంట్స్ లేని వారు.. ఒకవేళ ఉన్నా ఆధార్‌ అనుసంధానం చేయక ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్న వారు సమీపంలోని పోస్టాఫీసుల దగ్గర అకౌంట్లు తెరవాలని ఆదేశాలు వచ్చాయని మహిళలు చెబుతున్నారు. ఈ ప్రచారంతోనే వీళ్లంతా పెద్ద సంఖ్యలో పోస్టాఫీసులకు వెళుతున్నట్లు తేలింది. ఇప్పటికే పోస్టాఫీసుల్లో ఖాతాలు ఉంటే.. ఎన్‌పీసీఐ (జాతీయ చెల్లింపుల సంస్థ)తో అనుసంధానం చేసుకోవాలన్న సూచనతో ఇలా వెళ్లామని చెబుతున్నారు ఇప్పటికే బ్యాంకుల్లో అకౌంట్‌లు ఉన్నవారు కూడా.. ఈ విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారం కారణంగా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు వెళుతున్నారు. అందుకే పోస్టాఫీసుల దగ్గర మహిళలతో రద్దీ కనిపిస్తోంది.

రూ.200తో పోస్టాఫీసు ఖాతా తెరిచేందుకు పిల్లలతో సహా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఇప్పటికే బ్యాంకుల్లో అకౌంట్‌లు ఉండి.. సంక్షేమ పథకాల కింద సాయం అందుకుంటున్న వారు మళ్లీ కొత్తగా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. 18 ఏళ్లు పైబడిన మహిళలందరి వ్యక్తిగత ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం రూ.1,500 జమ చేస్తారని కొందరు ప్రచారం చేశారట. ఒకవేళ తమకు పోస్టాఫీస్‌లో ఖాతా లేకపోతే ఆ డబ్బులు రావనే భయంతోనే పోస్టాఫీసులకు వెళుతున్నారని చెబుతున్నారు. పోస్టాఫీసులో అకౌంట్ ఉన్న వారు వాటికి నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ (ఎన్సీపీఐ)తో లింక్ కాకపోతే మాత్రమే పోస్టాఫీసులకు వెళ్లి లింక్ చేయించుకోవాలి. కానీ ఇవేం తెలియక సంక్షేమ పథకాలు ఎక్కడ కోల్పోతామో అన్న ఆందోళనతో జనం పోస్టాఫీసులకు పరుగులు తీస్తున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది