Post Office : పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్.. 5 ఏళ్లలో రూ. 14 లక్షలు
ప్రధానాంశాలు:
Post Office : పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్.. 5 ఏళ్లలో రూ. 14 లక్షలు
Post Office : పొదుపు చేసే క్రమంలో ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ వచ్చే మార్గాలను ఈ రోజుల్లో చాలా మంది అన్వేషిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే పోస్టాఫీస్ రకరకాల స్కీమ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్ ఈ ఆర్డీ స్కీమ్‌ను అందిస్తోంది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌గా చెప్పుకునే ఈ పొదుపు పథకం పెట్టుబడిదారులకు ఎటువంటి రిస్క్ లేకుండా సురక్షితమైన రాబడిని అందిస్తుంది.

Post Office : పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్.. 5 ఏళ్లలో రూ. 14 లక్షలు
Post Office : ఇది బెస్ట్ స్కీమ్..
ఈ పథకంలో నెలకు రూ. 100 నుంచి పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన రిటర్న్స్ పొందొచ్చు. దీనిపై వచ్చే వడ్డీ ప్రయోజనం స్థిరంగా ఉంటుంది. ఈ పథకం మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు. ఒకవేళ మధ్యలో తీసుకోవాలనుకుంటే 3 ఏళ్లు నిండిన తర్వాత తీసుకోవచ్చు. అయితే వడ్డీ తగ్గుతుంది. లేదంటే లోన్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 5 ఏళ్లలో రూ. 14 లక్షలు పొందాలను టార్గెట్‌గా పెట్టుకుంటే మీరు ఆర్డీ పథకంలో నెలకు రూ. 20 వేలు పొదుపు చేయాల్సి ఉంటుంది.
ఇలా మీరు ఐదేళ్ల పాటు పెట్టుబడి పెడితే మొత్తం రూ. 12,00,000 అవుతుంది. అయితే మీకు సుమారు రూ. 2,27,320 వడ్డీ రూపంలో లభిస్తుంది. ఇలా మొత్తం రూ. 14,27,320 సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆర్డీ పథకానికి 6.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఆర్డీ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా పోస్టాఫీసుకు వెళ్లి అకౌంట్ తెరవడానికి ఫామ్‌ను నింపాలి. దీనికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం అవుతాయి.