Post Office : ఏపీలోని పలు జిల్లాలలో మహిళలు పోస్టాఫీసులకి పరుగులు పెడుతున్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలుతో పాటుగా పలు జిల్లాల్లో పోస్టాఫీసుల దగ్గర రద్దీ ఉంది.. ఎక్కడ చూసినా మహిళలే ఎక్కువమంది కనిపిస్తున్నారు. ఇలా మహిళలకు పోస్టాఫీసుల దగ్గరకు వెళ్లడానికి కారణాలు ఏంటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు ఎక్కడ రావోననే భయంతోనే వీళ్లంతా పోస్టాఫీసుల దగ్గరకు వెళుతున్నట్లు తేలింది. ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ చెప్పుకోదగిన స్ధాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలెండర్లు మినహా మిగతా పథకాల ఊసెత్తడం లేదు. దీంతో ప్రభుత్వంపై పథకాల అమలుపై ఒత్తిడి పెరుగుతోంది.
ఇప్పటి వరకూ బ్యాంకుల్లో సేవింగ్ అకౌంట్స్ లేని వారు.. ఒకవేళ ఉన్నా ఆధార్ అనుసంధానం చేయక ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్న వారు సమీపంలోని పోస్టాఫీసుల దగ్గర అకౌంట్లు తెరవాలని ఆదేశాలు వచ్చాయని మహిళలు చెబుతున్నారు. ఈ ప్రచారంతోనే వీళ్లంతా పెద్ద సంఖ్యలో పోస్టాఫీసులకు వెళుతున్నట్లు తేలింది. ఇప్పటికే పోస్టాఫీసుల్లో ఖాతాలు ఉంటే.. ఎన్‌పీసీఐ (జాతీయ చెల్లింపుల సంస్థ)తో అనుసంధానం చేసుకోవాలన్న సూచనతో ఇలా వెళ్లామని చెబుతున్నారు ఇప్పటికే బ్యాంకుల్లో అకౌంట్‌లు ఉన్నవారు కూడా.. ఈ విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారం కారణంగా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు వెళుతున్నారు. అందుకే పోస్టాఫీసుల దగ్గర మహిళలతో రద్దీ కనిపిస్తోంది.
రూ.200తో పోస్టాఫీసు ఖాతా తెరిచేందుకు పిల్లలతో సహా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఇప్పటికే బ్యాంకుల్లో అకౌంట్‌లు ఉండి.. సంక్షేమ పథకాల కింద సాయం అందుకుంటున్న వారు మళ్లీ కొత్తగా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. 18 ఏళ్లు పైబడిన మహిళలందరి వ్యక్తిగత ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం రూ.1,500 జమ చేస్తారని కొందరు ప్రచారం చేశారట. ఒకవేళ తమకు పోస్టాఫీస్‌లో ఖాతా లేకపోతే ఆ డబ్బులు రావనే భయంతోనే పోస్టాఫీసులకు వెళుతున్నారని చెబుతున్నారు. పోస్టాఫీసులో అకౌంట్ ఉన్న వారు వాటికి నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ (ఎన్సీపీఐ)తో లింక్ కాకపోతే మాత్రమే పోస్టాఫీసులకు వెళ్లి లింక్ చేయించుకోవాలి. కానీ ఇవేం తెలియక సంక్షేమ పథకాలు ఎక్కడ కోల్పోతామో అన్న ఆందోళనతో జనం పోస్టాఫీసులకు పరుగులు తీస్తున్నారు.
Samsung : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో గత మూడు రోజులుగా టికెట్ టు ఫినాలే…
Nagababu : వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న ముగ్గురు రిజైన్ చేయడంతో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ మూడు…
Samantha Father : హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. గతంలో కంటే…
Rythu Bharosa Scheme : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం…
New Income Tax Rules : రాబోయే డిసెంబర్ 1 నుంచి కొన్ని ఆదాయపు పన్ను నియమాలు మారుతున్నాయి. ముఖ్యంగా…
Nagarjuna : అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఓ పక్క నాగ చైతన్య, శోభిత పెళ్లి ముహుర్తం దగ్గర…
Rose Water : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క అమ్మాయి కూడా అందంగా కనిపించాలి అనుకుంటుంది. దీనికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు…
This website uses cookies.