Yarlagadda VS Vallabhaneni : వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డ.. గన్నవరం టికెట్ ఎవరికి? జగన్ ఎవరిని బరిలో దించబోతున్నారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Yarlagadda VS Vallabhaneni : వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డ.. గన్నవరం టికెట్ ఎవరికి? జగన్ ఎవరిని బరిలో దించబోతున్నారు?

 Authored By kranthi | The Telugu News | Updated on :14 August 2023,7:00 pm

Yarlagadda VS Vallabhaneni : ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా కూడా ప్రధాన పార్టీలు మాత్రం అస్సలు ఆగడం లేదు. ఓవైపు రెండోసారి అధికారంలోకి రావాలని అధికార వైసీపీ, చివరి చాన్స్ అంటూ టీడీపీ, ఒక్క చాన్స్ అంటూ జనసేన ఈ మూడు పార్టీలు రాష్ట్రమంతా పర్యటిస్తూ ప్రజలను అభ్యర్థిస్తున్నాయి. ప్రజలు ఎవరికి ఎక్కువ ఓట్లేసి గెలిపిస్తారు అనేది పక్కన పెడితే ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారో ఎవరికి వారే భుజాలు తడుముకుంటున్నారు. ఆ పార్టీ నుంచి నేను, ఈ పార్టీ నుంచి నేను అంటూ ఎవరికి వారే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాలు కూడా నిర్వహించుకుంటున్నారు.

అసలు ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. సిట్టింగ్స్ కే మళ్లీ సీట్లు అంటూ హడావుడి చేస్తున్నారు కానీ.. చివరి నిమిషం వరకు ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి బరిలో ఉంటారో చెప్పడం కష్టం. అధికార వైసీపీ పార్టీ కూడా ఇంకా టికెట్స్ కన్ఫమ్ చేయలేదు. కానీ.. సీఎం జగన్ తనకు దగ్గర అనుకున్న వాళ్లకు టికెట్స్ ముందే కన్ఫమ్ చేశారట. అక్కడే తేడా కొట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గంలో ఆశావహులు చాలామందే ఉన్నారు. ఈనేపథ్యంలో జగన్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఎవరి హామీ ఇవ్వలేదు అనే దానిపై క్లారిటీ లేదు. గన్నవరం నియోజకవర్గం విషయంలోనూ అదే జరుగుతోంది.

yarla gadda venkata rao versus vallabhaneni vamsi in ysrcp

yarla gadda venkata rao versus vallabhaneni vamsi in ysrcp

Yarlagadda VS Vallabhaneni : ఎన్నికల బరిలో నిలవడం కోసం యార్లగడ్డ హడావుడి

ప్రస్తుతం గన్నవరంలో వైసీపీలోనే అంతర్గత పోరు సాగుతోంది. టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వల్లభనేని.. జగన్ కు దగ్గరయిపోయారు. అదే వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావ్ ఓడిపోయారు. దీంతో ఆయన చాలా ఏళ్ల పాటు గన్నవరానికి దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ యార్లగడ్డ హడావుడి చేస్తున్నారు. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. లేదు ఆయన ఈసారి మళ్లీ వైసీపీ నుంచే గన్నవరంలో పోటీ చేస్తారని అంటున్నారు. మరి.. గన్నవరం నుంచి ఇద్దరూ పోటీకి దిగితే ఎవరికి టికెట్ ఇవ్వాలి. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. దీన్ని వైఎస్ జగన్ ఎలా సాల్వ్ చేస్తారో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది