YCP : ఆదిలోనే అధ్యక్షురాలు పురందేశ్వరికి ఊహించని కౌంటర్ ఇచ్చిన వైసీపీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YCP : ఆదిలోనే అధ్యక్షురాలు పురందేశ్వరికి ఊహించని కౌంటర్ ఇచ్చిన వైసీపీ..!

 Authored By sekhar | The Telugu News | Updated on :16 July 2023,2:00 pm

YCP : ఇటీవల ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షురాలుగా పురందేశ్వరిని ఆ పార్టీ అధిష్టానం నియమించడం తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శలు చేశారు. వైసీపీ విధానాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం 22 లక్షల పక్కా ఇళ్లను మంజూరు చేస్తే 35% కూడా నిర్మాణాలు పూర్తి చేయలేకపోయినట్లు వైసీపీ మండి పడటం జరిగింది.

కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నారు. అభివృద్ధి మాత్రం శూన్యమని వ్యాఖ్యానించారు. అయితే ఆదిలోనే బీజేపీ నూతన అధ్యక్షురాలు పురందేశ్వరికి వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుందని పురందేశ్వరి ఆరోపించటంపై జవాబు ఇచ్చారు. “కేంద్ర ప్రభుత్వ పథకాల క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ కి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధులు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ.. ప్రత్యేక హోదా ఇవ్వాలి.

ప్రత్యేక హోదా ఇవ్వండి… ఆ క్రెడిట్ అంతా మీకే ఇస్తాం. రైల్వే జోన్ మంజూరు చేయాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి. పోలవరం ప్రాజెక్టు, చెన్నై వైజాగ్ కారిడార్ పూర్తి చేయండి. రైతు సంక్షేమానికి మద్దతు ఇవ్వండి” అని ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. వైసీపీ పై ఎలాంటి విమర్శలు చేసిన ఏమీ అనలేరన్న భావన మొన్నటి వరకు ఉన్న క్రమంలో ఒక్కసారిగా.. నూతన అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన కామెంట్లకు వైసీపీ ఇచ్చిన కౌంటర్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది