YCP MP Gurumurthy : దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు పెట్టండి.. ప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ..!
ప్రధానాంశాలు:
YCP MP Gurumurthy : దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు పెట్టండి.. ప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ..!
YCP MP Gurumurthy : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా ఉంది. 2019 లో గెలిచి అధికారం దక్కించుకున్న వైసీపీ అప్పుడు కూడా బీజేపీకి తన సపోర్ట్ అందించింది. ఐతే తాజాగా వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రధాని మోడీకి లేఖ రాస్తూ దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని లేఖలో ప్రస్తావించారు. దక్షణ భారత్ లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని ఆయన ప్రతిపాదన చేశారు. ఏడాదికి కనీసం రెండు పార్లమెంట్ సెషన్స్ అయినా దక్షిణ భార రాష్ట్రాల్లో నిర్వహించాలని ఆయన అన్నారు. ఢిల్లీ వారావరణ పరిస్థితులు బాగాలేని కారణంగా దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని గురు మూర్తి లేఖలో రాశారు. ప్రధానితో పాటు పార్లమెంట్ వ్యవహాఅల శాఖా మంత్రి కిరణ్ రిజిజు కి కూడా గురు మూర్తి లేఖ రాశారు.
YCP MP Gurumurthy ఢిల్లీలోని వాతావరణ పరిస్థితి..
ఢిల్లీలోని వాతావరణ పరిస్థితి ఎంపీల పనితీరుపై ప్రభావితం చేస్తుందని ఆయన చెప్పారు. ఐతే గురు మూర్తి కొత్త ప్రతిపాదన చర్చలకు దారి తీస్తుంది. దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాల వల్ల జాతీయ సమగ్రత మరింత పెరుగుతుందని ఆయన అన్న విషయాలను సపోర్ట్ చేస్తున్నారు కొనరు. 1968 లో స్వతంత్ర ఎంపీ ప్రకాశ్ వీర్ శాస్త్రి ఇలానే దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు జరపాలని ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టారని గురుమూర్తి లేఖలో ప్రస్తావించారు.
ఐతే గురుమూర్తి రాసిన ఈ లేఖ మిగతా ఎంపీల్లో కూడా చర్చ జరిపేలా చేసింది. ఐతే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన మీద ఎలా స్పందిస్తుందో చూడాలి. పార్లమెంట్ సమావేశాలు కేవలం ఢిల్లీలోనే కాకుండా దక్షిణాదిన కనీసం రెండు సెషన్లు అయినా జరిగితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. ఐతే దీని పై ప్రధాన మంత్రి ఇంకా కేంద్ర మంత్రిత్వ శాఖ ఎలా స్పందిస్తుంది అన్నద్ది నేషనల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. YCP MP Gurumurthy Proposal Parliament Sessions in South India , YCP, MP Gurumurthy, Parliament Sessions, South India