AP politics : ఇటీవల రాజకీయాలు మరీ దిగజారిపోతున్నాయి. ఇంకా దిగజారడానికి ఏమీ లేదు అన్నంతగా దిగజారిపోతున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే దగ్గర్నుంచి పక్క పార్టీలో గెలిచిన వారిని నిసిగ్గుగా కండువాలు కప్పి కొనుక్కొనే పరిస్థితి వరకు దిగిజారిపోయారని విమర్శలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎవరి గురించి వారు ఎక్కువగా చెప్పుకోవడం కంటే ప్రత్యర్ధులపై బురద జల్లడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక తిట్ల పురాణంలో భాగంగా వదులుతున్న ఆణిముత్యాలు సంగతి చెప్పాల్సిన పని లేదు. చూపించే వాడికి శక్తి, వినే వాడికి ఓపిక ఉండాలే కాని ఎంతసేపైనా ఆ తిట్ల పురాణాలు వినిపిస్తూనే ఉంటాయి.
ఈ క్రమంలోనే మరింత దిగజారిపోయిన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, ఫ్యామిలీ మెంబర్స్ ని సైతం టార్గెట్ చేస్తూ చేసే తిట్లు వ్యక్తిత్వ హననానికి పాల్పడే పనికిమాలిన ప్రయత్నాల నడుమ తాజాగా మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దిగజారడానికి ఇంకా ఏమీ లేదు అన్నట్లుగా కండోమ్ ప్యాకెట్లతో ప్రత్యర్థులపై బురద జల్లే ప్రయత్నాలు వారి స్థాయిని దిగజార్చే విన్యాసాలు తెరపైకి వచ్చాయి. అందులో భాగంగా తాజాగా భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ నేతలు సిద్ధం సభల పేరుతో వైసీపీ నాయకులు కండోమ్ ప్యాకెట్లు పంచుతున్నారని రెండు పార్టీలు ట్విట్టర్ వేదికగా పోస్ట్ లు పెడుతున్నాయి.
దీంతో నెటిజన్లు దిగజారడం అంటే మరీ ఇంతలా దిగజారాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ విషయంపై ఆన్లైన్ వేదికగా స్పందించిన టీడీపీ సిద్ధం .. సిద్ధం అంటూ కేకలు పెట్టింది ఇందుకా..ఇలాంటి నీచపు ప్రచారాలు చేసే బదులు శవాల మీద చిల్లర ఏరుకోవచ్చు కదా అని స్పందించింది. ఇక ఇదే సమయంలో తమ పార్టీ ప్రచారం కోసం చివరికి ప్రజలకు కండోమ్ లు కూడా పంపిణీ చేస్తుంది టీడీపీ అని, ఇదెక్కడి పిచ్చి ప్రచారం, నెక్స్ట్ వయాగ్రాలు కూడా పంచుతారేమో .. కనీసం అక్కడితోనైనా ఆగుతారా లేకపోతే ముందు ముందు ఇంకా దిగజారుతారా అంటూ వైసీపీ రియాక్ట్ అయింది. ఈ విధంగా ఏపీ రాజకీయాలు మరింత దిగజారినట్లుగా తెలుస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.