Watermelon Seeds : పుచ్చ గింజల టీతో ఎన్ని ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు...!
Watermelon Seeds : సహజంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం.. వేసవికాలం వచ్చిందంటే పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం.. అయితే అందరూ కూడా పుచ్చకాయలను తిని వాటి గింజలను పడేస్తూ ఉంటారు. పుచ్చకాయ గింజలు డ్రై ఫ్రూట్స్ లో ఒకటి అని మనకు తెలుసు. ఈ గింజలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రధానంగా వేసవికాలంలో పుచ్చకాయ గింజలతో టీ తయారు చేసుకుని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయట మరి అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. నిజానికి పుచ్చకాయలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీనితో దాహాన్ని తీర్చడమే కాదు. శరీరం డిహైడ్రేషన్ గురి అవ్వకుండా ఉంటుంది. శరీరం కూల్ గా ఉంచుతుంది. పుచ్చకాయల లో ఉండే గింజలు నీరు లేదా టీతో ఎన్నో పోషకాలు లభిస్తాయి.
పుచ్చకాయ గింజల నీరు: పుచ్చకాయ గింజలను శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ నీటిని నిత్యం తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి.పుచ్చ గింజల టీ: పుచ్చ గింజలను తీసి వాటిని ఆరబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పుచ్చ గింజల టి తయారీ కోసం ఒక గిన్నెలో లీటర్ నీరు పోసుకోవాలి. దాన్లో కొంచెం పుచ్చకాయ గింజల పొడి వేసి బాగా ఉడికించాలి. దాన్లో కొంచెం నిమ్మకాయ రసం, నెయ్యి వేసి తాగాలి. ఇలా మూడు రోజులు తాగినట్లయితే.. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి.పుచ్చకాయ గింజల టి వలన కలిగే ఉపయోగాలు.
దృఢమైన జుట్టు కోసం: బలమైన జుట్టుకు పుచ్చకాయ గింజల నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు డామేజ్, దురద నుంచి ఉపశమనం కలిగిస్తుంది.బీపీ కంట్రోల్ చేయడానికి: పుచ్చకాయ గింజల్లో ఆ మైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను పెంచుతాయి. దీనిలోని క్యాల్షియం ఎముకలను బలోపితం చేస్తాయి. రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. రక్తనాళాలను సంకుచితం కాకుండా ఉంచుతాయి.
గుండె ఆరోగ్యానికి మేలు: మీ గుండె ఆరోగ్యంగా ఉండడం కోసం పుచ్చకాయ గింజల నీరు తాగడం చాలా మంచిది. ఈ నీటిని ప్రతి రోజు తాగడం వలన గుండె సమస్య నుంచి బయటపడవచ్చు…
అలాగే ఈ గింజల నీటిని తాగడం వలన అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి..
Eat Eggs In Summer : ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆహారాలలో ప్రధానమైనవి గుడ్లు. వాటి అధిక ప్రోటీన్ కంటెంట్…
Green Tea : మనలో చాలా మందికి, గ్రీన్ టీ ఆరోగ్యకరమైన జీవనశైలిని వాగ్దానం చేసే అమృతం లాంటిది. ఇది…
Rare Trigrahi Raja Yoga : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత…
Rajiv yuva Vikasam : తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్…
AP Dwcra Women : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ,…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ వ్యవస్థలో పారదర్శకత, సమగ్రత కలిగించేందుకు చేపట్టిన "భూభారతి" చట్టానికి ప్రజల…
Mangoes : వేసవి అంటే మామిడి పండ్ల రుచులే గుర్తొస్తాయి. దేశవ్యాప్తంగా మామిడి సీజన్ ఊపందుకుంటే, పలు రకాల వెరైటీలు…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువతకు…
This website uses cookies.