India VS Australia : నిన్న జరిగిన భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ దారుణంగా ఓడిపోయింది. ఆ మ్యాచ్ ఓటమిని టీమిండియా కూడా తీసుకోలేకపోయింది. భారతదేశంలోని 140 కోట్ల మంది భారతీయులు కూడా భారత్ ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయారు. ఆస్ట్రేలియా గెలుపు ఖాయం కాగానే.. ఒక్క మోదీ స్టేడియం మాత్రమే కాదు.. యావత్ భారత్ మొత్తం మూగబోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ సాధించిన ఆనందంలో సంబురాలు చేసుకుంటూ ఉంటే.. భారత్ మాత్రం సైలెంట్ అయిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర ప్లేయర్స్ అందరూ వరల్డ్ కప్ చేజారడంతో వెక్కి వెక్కి ఏడ్చారు. చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా డిసప్పాయింట్ అయ్యారు. అదే వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తూ భారత్ ఇక ఓడిపోతుందని తెలిసి ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు.
భారత్ ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుతో జ్యోతి కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. తిరుపతికి చెందిన ఈ యువకుడు.. నిన్న ఫైనల్ మ్యాచ్ ను చూస్తూ భారత్ 240 పరుగులే చేసేసరికి.. భారత్ గెలవదని టెన్షన్ పడ్డాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి టెన్షన్ తోనే మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. టీమిండియా ఓడిపోవడం చూశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర ప్లేయర్స్ కన్నీళ్లు పెట్టుకోవడం చూశాడు. అంతే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన స్నేహితులు అతడిని తిరుపతిలోని ఓ ఆసుపత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది. అప్పటికే జ్యోతి కుమార్ చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.
జ్యోతి కుమార్ ది తిరుపతిలోని దుర్గసముద్రం. క్రికెట్ అంటే చాలా ఇష్టం. భారత్ ఏ మ్యాచ్ లో ఓడిపోయినా అస్సలు తట్టుకోలేడు. తాజాగా భారత్ ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుతో జ్యోతి కుమార్ చనిపోయాడు. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.