Categories: andhra pradeshNews

Ys Jagan : టీడీపీ నుండి వచ్చిన ఆ ఎమ్మెల్యేపై జగన్ కు పీకల్లోతు కోపం ఉందట

Advertisement
Advertisement

తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు వైకాపా నుండి వలసలను అధికంగా ప్రోత్సహించారనే విషయం తెల్సిందే. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు వైకాపాను వీడి తెలుగు దేశం పార్టీని చేరారు. ఇప్పుడు వైకాపా అధికారంలో ఉంది. సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి చిన్న సైగ చేస్తే చాలు తెలుగు దేశం పార్టీ నుండి చంద్రబాబు నాయుడు గుడ్ బై చెప్పి వైకాపాలో జాయిన్‌ అయ్యేందుకు చాలా మంది సిద్దంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు సగం మంది ఎమ్మెల్యేలు హ్యాండ్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎక్కువగా వలసలను ప్రోత్సహించడం లేదు. బేషరతుగా వచ్చిన వారికి మాత్రమే వైకాపాలో ఛాన్స్ ఉంటుంది.

Advertisement

తెలుగు దేశం పార్టీ నుండి బేషరతుగా వచ్చిన ఎమ్మెల్యేల్లో విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ ఒకరు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో తెలుగు దేశం ను వీడి వైకాపాలో జాయిన్ అయిన ఈయన ఇటీవల జీవీఎంసీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తెర తీసింది. ఆయన నియోజక వర్గం పరిధిలో మొత్తం 13 డివిజన్లు ఉంటే అందులో కేవలం 5 డివిజన్లను మాత్రమే వైకాపా గెలుచుకుంది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ వ్యవహరించిన తీరే మిగిలిన చోట్ల ఓటమికి కారణం అంటున్నారు. గెలిచిన వారు కూడా వాసుపల్లి పేరుతో గెలిచిన వారు కాదు. వారికి సొంత ఇమేజ్ ఉన్న వారే అంటున్నారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు.

Advertisement

ap cm ys jagan

అభ్యర్థుల ఎంపిక నుండి మొదలుకుని ఎన్నికల రోజు వరకు ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై విశాఖ ఇంచార్జ్‌ విజయ సాయి రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడట. విజయ సాయి రెడ్డితో ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడినట్లుగా చెబుతున్నారు. జీవీఎంసీలో మెజార్టీ భారీగా వచ్చే అవకాశం కేవలం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్ వల్లే మిస్ అయ్యిందని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి భావిస్తున్నాడట. చాలా నమ్మకం పెట్టుకుని బాధ్యతలు అప్పగిస్తే ఆయన తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారేమో అనే అనుమానాలను కొందరు పార్టీ నాయకులు సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వద్ద వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆయనపై వైకాపా అధినేత సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

Advertisement

Recent Posts

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

13 mins ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

1 hour ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

3 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

4 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

5 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

6 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

7 hours ago

This website uses cookies.