Pawan Kalyan : లండ‌న్ వెళ్లిన జ‌గ‌న్, అమెరికాలో ఉన్న చంద్ర‌బాబు.. మ‌రి ప‌వ‌న్ ఎక్క‌డ ఉన్న‌ట్టు? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Pawan Kalyan : లండ‌న్ వెళ్లిన జ‌గ‌న్, అమెరికాలో ఉన్న చంద్ర‌బాబు.. మ‌రి ప‌వ‌న్ ఎక్క‌డ ఉన్న‌ట్టు?

Pawan Kalyan : ఈ సారి ఏపీ ఎన్నిక‌లు చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగాయి. వైసీపీ వర్సెస్ కూట‌మి ఎన్నిక‌ల‌లో జోరుగా ప్ర‌చారాలు చేసుకోవ‌డం చూశాం.అయితే జూన్ 4 రోజున ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది అనేది చెప్ప‌డం క‌ష్టంగానే మారింది. పోటీ మాత్రం ఈ సారి చాలా టైట్‌గా ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా ఎన్నిక‌ల ప్ర‌చారాల‌తో బిజీగా ఉన్న నాయ‌కులు ఇప్పుడు విదేశాల‌కి వెళ్లారు. ఎల‌క్ష‌న్స్ అనంతరం ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భార్య […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 May 2024,7:30 pm

Pawan Kalyan : ఈ సారి ఏపీ ఎన్నిక‌లు చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగాయి. వైసీపీ వర్సెస్ కూట‌మి ఎన్నిక‌ల‌లో జోరుగా ప్ర‌చారాలు చేసుకోవ‌డం చూశాం.అయితే జూన్ 4 రోజున ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది అనేది చెప్ప‌డం క‌ష్టంగానే మారింది. పోటీ మాత్రం ఈ సారి చాలా టైట్‌గా ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా ఎన్నిక‌ల ప్ర‌చారాల‌తో బిజీగా ఉన్న నాయ‌కులు ఇప్పుడు విదేశాల‌కి వెళ్లారు. ఎల‌క్ష‌న్స్ అనంతరం ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భార్య భారతితో కలిసి లండన్ వెళ్లారు. ఆయన జూన్ 1న కానీ తిరిగి రారు. వచ్చిన వెంటనే ఓట్ల లెక్కింపు సమయంలో పార్టీ నేతలకు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తే జగన్ మరోసారి సీఎం అవుతారు. లేదంటే ప్రతిపక్ష నేత పాత్రలో ఉంటారు.

Pawan Kalyan ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ‌?

మ‌రోవైపు ఎల‌క్ష‌న్స్ ప్ర‌చారాల‌తో చాలా బిజీగా ఉన్న చంద్ర‌బాబు త‌న భార్య‌ని తీసుకొని అమెరికా వెళ్లారు. ఇటీవ‌ల సింగపూర్ లో ఆయన రోడ్డు దాటుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇవి ఎడిట్ చేసినవని తర్వాత తేలింది. చంద్రబాబు ఈ నెల 31న తిరిగి హైద‌రాబాద్ రానున్నారు.. అంటే జగన్ కంటే ఒకరోజు ముందే ఏపీకి తిరిగిరానున్నారు.ఇక ఏపీ రాజ‌కీయాల‌లో మ‌రో కీల‌క‌మైన వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. సినిమాలు, రాజ‌కీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకుపోతున్న ప‌వ‌న్ క‌ళ్యాన్ ఈ సారి రాజ‌కీయాల‌లో త‌న స‌త్తా చాట‌తార‌ని అంటున్నారు.

Pawan Kalyan లండ‌న్ వెళ్లిన జ‌గ‌న్ అమెరికాలో ఉన్న చంద్ర‌బాబు మ‌రి ప‌వ‌న్ ఎక్క‌డ ఉన్న‌ట్టు

Pawan Kalyan : లండ‌న్ వెళ్లిన జ‌గ‌న్, అమెరికాలో ఉన్న చంద్ర‌బాబు.. మ‌రి ప‌వ‌న్ ఎక్క‌డ ఉన్న‌ట్టు?

పవన్ కల్యాణ్ ఏపీలో పోలింగ్ అనంతరం వారాణాసీలో ప్రధాని మోదీ నామినేషన్ కు చంద్రబాబుతో కలిసి వెళ్లారు. ఆ తర్వాత భార్య అన్నా లెజ్నోవాతో కలిసి ఆలయాలను సందర్శించారు. కాగా, అప్పటినుంచి పవన్ ఎక్కడున్నదీ తెలియ‌డం లేదు. ఆయన విదేశాల‌కి వెళ్లారా లేకుంటే ఇక్క‌డే విశ్రాంతి తీసుకుంటున్నారా అనేది తెలియ‌రావ‌డం లేదు. ప‌వ‌న్ ప‌లు సినిమాల షూటింగ్ పెండింగ్‌లో పెట్టారు కాబ‌ట్టి వాటిని పూర్తి చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ప‌వ‌న్ చాలా నీర‌సంగా క‌నిపించాడు. మండే ఎండ‌లోను ఉత్సాహంగా తిరిగారు. మే 13న పోలింగ్ అనంతరం పవన్ పిఠాపురం వెళ్లలేదు. ఫలితాల వెల్లడి రోజైన జూన్ 4 తిరిగి తాను పోటీచేసిన నియోజకవర్గానికి వెళ్లనున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది