
Pawan Kalyan : లండన్ వెళ్లిన జగన్, అమెరికాలో ఉన్న చంద్రబాబు.. మరి పవన్ ఎక్కడ ఉన్నట్టు?
Pawan Kalyan : ఈ సారి ఏపీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. వైసీపీ వర్సెస్ కూటమి ఎన్నికలలో జోరుగా ప్రచారాలు చేసుకోవడం చూశాం.అయితే జూన్ 4 రోజున ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది చెప్పడం కష్టంగానే మారింది. పోటీ మాత్రం ఈ సారి చాలా టైట్‌గా ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా ఎన్నికల ప్రచారాలతో బిజీగా ఉన్న నాయకులు ఇప్పుడు విదేశాలకి వెళ్లారు. ఎలక్షన్స్ అనంతరం ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భార్య భారతితో కలిసి లండన్ వెళ్లారు. ఆయన జూన్ 1న కానీ తిరిగి రారు. వచ్చిన వెంటనే ఓట్ల లెక్కింపు సమయంలో పార్టీ నేతలకు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తే జగన్ మరోసారి సీఎం అవుతారు. లేదంటే ప్రతిపక్ష నేత పాత్రలో ఉంటారు.
మరోవైపు ఎలక్షన్స్ ప్రచారాలతో చాలా బిజీగా ఉన్న చంద్రబాబు తన భార్యని తీసుకొని అమెరికా వెళ్లారు. ఇటీవల సింగపూర్ లో ఆయన రోడ్డు దాటుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇవి ఎడిట్ చేసినవని తర్వాత తేలింది. చంద్రబాబు ఈ నెల 31న తిరిగి హైదరాబాద్ రానున్నారు.. అంటే జగన్ కంటే ఒకరోజు ముందే ఏపీకి తిరిగిరానున్నారు.ఇక ఏపీ రాజకీయాలలో మరో కీలకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమాలు, రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకుపోతున్న పవన్ కళ్యాన్ ఈ సారి రాజకీయాలలో తన సత్తా చాటతారని అంటున్నారు.
Pawan Kalyan : లండన్ వెళ్లిన జగన్, అమెరికాలో ఉన్న చంద్రబాబు.. మరి పవన్ ఎక్కడ ఉన్నట్టు?
పవన్ కల్యాణ్ ఏపీలో పోలింగ్ అనంతరం వారాణాసీలో ప్రధాని మోదీ నామినేషన్ కు చంద్రబాబుతో కలిసి వెళ్లారు. ఆ తర్వాత భార్య అన్నా లెజ్నోవాతో కలిసి ఆలయాలను సందర్శించారు. కాగా, అప్పటినుంచి పవన్ ఎక్కడున్నదీ తెలియడం లేదు. ఆయన విదేశాలకి వెళ్లారా లేకుంటే ఇక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారా అనేది తెలియరావడం లేదు. పవన్ పలు సినిమాల షూటింగ్ పెండింగ్‌లో పెట్టారు కాబట్టి వాటిని పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఎన్నికల ప్రచార సమయంలో పవన్ చాలా నీరసంగా కనిపించాడు. మండే ఎండలోను ఉత్సాహంగా తిరిగారు. మే 13న పోలింగ్ అనంతరం పవన్ పిఠాపురం వెళ్లలేదు. ఫలితాల వెల్లడి రోజైన జూన్ 4 తిరిగి తాను పోటీచేసిన నియోజకవర్గానికి వెళ్లనున్నారు.
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…
Pushpa-3 : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఒక్కటే పుష్ప–3 (Pushpa-3)ఉంటుందా? లేక ఇది…
YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్‌తో…
PM Svanidhi: చిన్నచిన్న వ్యాపారాలే ఆధారంగా జీవించే వీధి వ్యాపారుల(Street vendors)కు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం…
Business Ideas: ఉద్యోగం దొరకలేదని లేదా చేస్తున్న జాబ్‌లో సరైన ఆదాయం లేదని చాలా మంది యువత(youth) నిరాశ చెందుతున్నారు.…
Today Gold Rate 18 January 2026 : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ రావడం…
This website uses cookies.