YS Jagan : చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారా ? వైఎస్ జగన్
ప్రధానాంశాలు:
YS Jagan : చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారా ? వైఎస్ జగన్
YS Jagan : తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం రాజకీయ సెగలు రేపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth Reddy అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు Ap ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. తెలంగాణ Telangana అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తాను జరిపిన అంతర్గత చర్చల వల్ల రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLIS) పనులు ఆగిపోయాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో Chandrababu Naidu మాట్లాడి ప్రాజెక్టును ఆపు చేయించానని ఆయన బహిరంగంగా ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. రాయలసీమ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును, కేవలం రాజకీయ సంబంధాల కోసం చంద్రబాబు పక్కన పెట్టేశారా అనే అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటన చంద్రబాబు నాయుడిని ఆత్మరక్షణలో పడేయడమే కాకుండా, విపక్షాలకు బలమైన ఆయుధాన్ని అందించినట్లయింది.
YS Jagan : చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారా ? వైఎస్ జగన్
YS Jagan రేవంత్ వ్యాఖ్యలు చంద్రబాబు కు తలనొప్పిగా మారాయా..?
ఈ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని, రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టినప్పటికీ చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని జగన్ ప్రశ్నించారు. టీడీపీ మంత్రులు ఇస్తున్న వివరణలు సరిపోవని, స్వయంగా ముఖ్యమంత్రే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. “తమ మధ్య జరిగిన ఒప్పందం ఏంటో చంద్రబాబు బయటపెట్టాలి” అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రాజెక్టును తుంగలో తొక్కడం ద్వారా సీమ ప్రజల నోట్లో మట్టి కొట్టారనే విమర్శలు వైసీపీ నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
YS Jagan చంద్రబాబు కు శిష్యుడిని ఒక్కమాట అనే ధైర్యం లేదు – వైఎస్ జగన్
ప్రస్తుతం ఏపీ ప్రజలు చంద్రబాబు నాయుడి నుంచి స్పష్టమైన సమాధానాన్ని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అబద్ధమని చంద్రబాబు ఖండించకపోతే, ఆయన నిజంగానే ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారనే ముద్ర పడే అవకాశం ఉంది. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాకుండా, ఏపీ ప్రజల, ముఖ్యంగా రాయలసీమ రైతుల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యగా మారింది. ‘రెండు కళ్ల సిద్ధాంతం’ లాంటి నర్మగర్భ వ్యాఖ్యలతో కాలయాపన చేయకుండా, ప్రాజెక్టు విషయంలో తన వైఖరి ఏంటో చంద్రబాబు స్పష్టం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. లేనిపక్షంలో, ఈ మౌనం ఆయన రాజకీయ ప్రతిష్ఠకు మరింత నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది.