Ys Jagan : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీవ్ర చర్చనీ యాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష పార్టీలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఆసరాగా చేసుకుని అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరితోపాటు ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక ఈ చట్టం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను దోచేస్తుందని కూటమి వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే కూటమి వర్గాలు చేస్తున్న ఈ విమర్శలకు వైసీపీ శ్రేణులు కూడా అంతే దీటుగా సమాధానం చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల విశాఖపట్నం జిల్లా పాయకారావుపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా… దాని గురించి ఏమీ తెలియకుండానే చంద్రబాబు నాయుడు దుష్ప్రచారాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. బహుశా చంద్రబాబు నాయుడుకి జగన్ అంటే ఏంటో తెలియకపోవచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పుకొచ్చారు. జగన్ ఇచ్చే వాడే కానీ లాక్కునేవాడు కాదని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ప్రజలకు వారి యొక్క భూములు పై సర్వహక్కులు కల్పించడమేనని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. దాదాపు వందేళ్ళ కిందట ఎప్పుడో బ్రిటిష్ కాలంలో మన రాష్ట్రంలో భూముల సర్వేలు జరిగాయి. ఇక ఆ తర్వాత నుండి సర్వేలు జరగలేదు. దీని కారణంగా భూములు యొక్క సబ్ డివిజన్ జరగలేదు. దీంతో రైతులు వారి భూములను అమ్మే సమయంలో మరియు విక్రయించే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , అలాంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులను దూరం చేయడమే ల్యాండ్ టైటిలింగ్ ప్రధాన లక్ష్యం అని జగత్ తెలిపారు. భూముల విషయంలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ దూరం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15వేల సచివాలయాలలో సర్వేయర్లను నియమించి భూములను రీ సర్వే చేపిస్తున్నట్లుగా తెలియజేశారు.
ప్రతి ఒక్కరి వారి భూములపై సంపూర్ణ హక్కులు కల్పించేందుకే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములను రిసర్వే చేస్తున్నామని…సర్వే పూర్తి చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పత్రాలను భూమి యజమానులకు అందిస్తామని జగన్ తెలిపారు. భూ యజమానులకు ఎంతగానో మేలును చేకూర్చే ఇలాంటి కార్యక్రమానికి ప్రతిపక్షాలు మద్దతు తెలపకుండా ఆరోపిస్తున్నాయని జగన్ మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని ఎవరు భూమిపై వారికి పూర్తి హక్కు లభిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలకు నష్టం కలిగించే ఏ ఒక్క పని కూడా జగన్ చేయడని కావున ప్రతిపక్ష పార్టీలు చెప్పే అసత్యపు మాటలను ఎవరు నమ్మవద్దని ఈ సందర్భంగా జగన్ ప్రజలకు తెలిపారు.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.