YS Jagan : ఐదేళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ఇటీవల ఎన్నికలలో దారుణమైన ఓటమి చెందారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు ఆయన సరికొత్త ప్రణాళికలు రచిస్తూ బిజీబిజీగా ఉన్నారు.రెండు వారాల వ్యవధిలోనే పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మరోసారి బెంగళూరుకు వెళ్తున్నారు. జూన్ 24నే బెంగళూరు వెళ్ళిన ఆయన.. జులై 1వరకు అక్కడే ఉండి వచ్చారు. ఇప్పుడు మళ్లీ బెంగళూరుకు వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఈ వరుస పర్యటనల మర్మం ఏంటనే చర్చ జరుగుతోంది.
గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్.. ఈ నెల 1 వరకు అక్కడే ఉన్నారు. మళ్లీ రెండు వారాల వ్యవధిలోనే బెంగళూరు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువశాతం పులివెందుల, బెంగళూరులోనే ఉన్నారు. ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. మరి ఈ సమావేశాలకు జగన్ వస్తారా లేదా అన్నది కూడా చూడాలి. అసెంబ్లీకి హాజరుకావడంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మాత్రం లేదు. కాలికి వైద్యం కోసం బెంగళూరు వెళుతున్నారనే ప్రచారంతో.. అసెంబ్లీకి వస్తారా?.. విశ్రాంతి కోసం బెంగళూరులోనే ఉంటారా అనేది చూడాలంటున్నారు. వాస్తవానికి జగన్ సోమవారం నుంచి తాడేపల్లిలోని నివాసంలో ప్రజా దర్భార్ ప్రారంభించాలని భావించారు. వైఎస్సార్‌సీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించారు.. కానీ బెంగళూరు పర్యటనతో వాయిదా వేశారు.
శాసన సభ సమావేశాల వేళ జగన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటే మాత్రం అది విమర్శలకు తావిస్తుంది. కాబట్టి ఆయన వారం రోజులకు తిరిగి వస్తారని, కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై పార్టీ నేతలతో మరోసారి చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వైఎస్సార్‌సీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగన్‌ను కలిసినట్లు ప్రచారం జరిగింది.. అలాగే పలువురు నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్సార్‌సీపీ మాత్రం ఇదంతా తప్పుడు ప్రచారమని కొందరు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని మండిపడ్డారు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.