Ys Jagan : జగన్ ఆశలపై చంద్రబాబు మెల్లమెల్లగా నీళ్లు చల్లుతున్నాడేంటి ?
Ys Jagan : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది. వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. దీంతో వచ్చే ఎన్నికలలో మంచి విజయం సాధించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో జోరు పెంచారు. విమర్శలు గుప్పిస్తున్నారు. ఆరు మాసాల్లోనే సర్కారు విఫలమైందని ఆయన కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కూటమి సర్కారుకు ప్రజలు బుద్ధి చెబుతారని కూడా ఆయన అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును తీసుకువచ్చింది. ఇప్పటికే కేంద్రం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని పార్లమెంటులో ఆమోదించుకుని.. రాజ్యాంగానికి కొన్ని సవరణలు చేసి.. ఈ బిల్లును ఆమోదించుకుంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ ఒకే సారి ఎన్నికలు వస్తాయి.
Ys Jagan : జగన్ ఆశలపై చంద్రబాబు మెల్లమెల్లగా నీళ్లు చల్లుతున్నాడేంటి ?
ఏపీలో ప్రస్తుతం మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటిల్లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమిలో బీజేపీ ఉన్నా.. ఓట్లు, సీట్లు మాత్రం ఈ రెండు పార్టీల కంటే తక్కువే. మరోవైపు వైసీపీ ఉంది. వైసీపీ సింగిల్ పోటీ చేసి 2019లో ఘనవిజయం సాధించింది. 2024లో మాత్రం ఊహించని స్థాయిలో పరాజయం పాలైంది. ఓటమి తర్వాత కొన్నిరోజులు కామ్‌గా ఉన్న వైసీపీ నేతలు.. ఇటీవల యాక్టివ్ అయ్యారు. జమిలి ప్రకటనలపై ఆశగా ఎదురుచూస్తున్నారు.జమిలి ఎన్నికలు జరిగితే.. వైసీపీకే లాభం అని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. జమిలి అంటున్నారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్గనైజ్డ్‌గా ఉంటే మనం సన్నద్ధంగా ఉంటామని పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
జమిలి ఎన్నికలు వస్తున్నాయనే జగన్ రోడ్డు మీదకు వస్తున్నారని.. తమను కూడా రమ్మంటున్నారని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ విషయం వైసీపీలోనూ చర్చగానే మారింది. మొత్తంగా జగన్ ఆశలు ఇప్పుడు జమిలిపైనే ఉన్నాయి. వచ్చే నాలుగున్నరేళ్ల పాటు ఆయన సైలెంట్‌గా ఉండే పరిస్థితి లేదు. ఈ క్రమంలో జమిలికి అనుకూలంగా వైసీపీ ఎంపీలు కూడా మద్దతు తెలపనున్నారు. ఈ ఎన్నికలు వస్తే.. ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకురావాలన్నది జగన్ తాలూకు ఆలోచనగా ఉంది. కాని చంద్రబాబు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదే అధికారం అని అంటున్నారు. ఒకవేళ బీజేపీ అనుకున్నట్టు జరిగితే.. 2027 మార్చి తర్వాత ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి ఇలానే ఉంటుందా అని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
This website uses cookies.