YS Jagan Master paln : ప్రతి బూత్ లో 60 శాతం ఓట్లు….పార్టీ నేతలకు వై.యస్ జగన్ దిశా నిర్దేశం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan Master paln : ప్రతి బూత్ లో 60 శాతం ఓట్లు….పార్టీ నేతలకు వై.యస్ జగన్ దిశా నిర్దేశం…

 Authored By aruna | The Telugu News | Updated on :29 February 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan Master paln : ప్రతి బూత్ లో 60 శాతం ఓట్లు....పార్టీ నేతలకు వై.యస్ జగన్ దిశా నిర్దేశం...

  •  YS Jagan Master paln : ఆంధ్ర రాష్ట్రంలోని ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తమదైన శైలిలో చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్లాలని తమ క్యాడర్ ను సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు.

  •  పూర్తి వివరాల్లోకి వెళితే....జగన్మోహన్ రెడ్డి తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 3,000 మంది కీలక నేతలతో మరో సిద్ధం మీటింగ్ నిర్వహించినట్లు సమాచారం.

YS Jagan Master paln : ఆంధ్ర రాష్ట్రంలోని ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తమదైన శైలిలో చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్లాలని తమ క్యాడర్ ను సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. ఒకవైపు సిద్ధం సభల ద్వారా జగన్ మోహన్ రెడ్డి ప్రజలలోకి వెళ్తుంటే “రా కదలిరా” అనే నినాదంతో మరోవైపు చంద్రబాబు నాయుడు తన క్యాడర్ ను యాక్టివ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా తమ క్యాడర్ ను యాక్టివ్ చేసుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి ముందడుగు వేశారని చెప్పాలి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా వారి యొక్క క్యాడర్లను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ఇటీవలే వారి పార్టీ యొక్క అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు కాబట్టి వారి క్యాడర్ ను ఎలా సమయుక్తం చేసుకుంటారనేది చర్చించదగ్గ విషయం. దానికంటే ముందు అసంతృప్తులను బుజ్జగించిన తర్వాత తర్వాత బాబు తన క్యాడర్ ను సిద్ధం చేసుకోవడం మనం చూడబోయే అంశం.

అయితే తాజాగా జగన్ మోహన్ రెడ్డి 60 శాతం ఓట్లు ప్రతి పోలింగ్ బూత్ లో కూడా వైసీపీ పార్టీకి పడాలంటే ఏం చేయాలి అనేటువంటి టాప్ సీక్రెట్ ని వారి యొక్క అధినాయకత్వంతో అలాగే వారి పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో, అలాగే పోలింగ్ బూత్ లో ఉండేటువంటి కార్యకర్తలతో సంభాషణలు జరిపినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయాలు గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే….జగన్మోహన్ రెడ్డి తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 3,000 మంది కీలక నేతలతో మరో సిద్ధం మీటింగ్ నిర్వహించినట్లు సమాచారం. ఇక దీనిలో వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎలా గెలవాలి అనే అంశాల గురించి వారందరికీ దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 , అలాగే 25 ఎంపీ సీట్లకు 25 రావాలి అనే అంశంపై మరోసారి ప్రధానంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక దీనికోసం చేయాల్సినటువంటి పనులేంటో కూడా వారికి స్పష్టంగా తెలియజేసినట్లు సమాచారం. అలాగే పార్టీ నేతలు అందరూ కూడా ఓటర్లకు ప్రతి నిమిషం అందుబాటులో ఉండాలనిజగన్ సూచించారట.. మరి ముఖ్యంగా పోలింగ్ బూత్ ప్లాన్ పై దృష్టి పెట్టాలని తెలియజేశారట. అంతేకాక రాబోయే 45 రోజులు చాలా కీలకమని వారందరికీ తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తాము అన్ని పర్యవేక్షిస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనుకుంటూ అందరూ దీనిపై దృష్టి పెట్టాలని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఎన్నికల బూత్ లో కూడా 60% కంటే ఎక్కువ ఓట్లు వచ్చే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు జగన్ సూచించినట్లు తెలుస్తోంది.

దీనికోసం అవసరమైనటువంటి అన్ని తీసుకోవాల్సిందిగా, పార్టీ నుంచి కూడా వారికి సహాయ సహకారాలు కూడా అందుతాయని తెలియజేశారు. అదేవిధంగా చంద్రబాబు లాగా తాము హామీ ఇచ్చి ఎప్పుడు విస్మరించలేదని, హామీలను ఇచ్చి వాటిని కచ్చితంగా అమలు చేశామని జగన్ నేతలకు సూచించారు. ఇక ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాల్సిందిగా నేతలకు సూచించారు. ఇక ఈ ఎన్నికలు కులపోరు కాదని వర్గ పోరని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయా అనే విషయాన్ని ప్రతి ఇంటింటికి చెప్పాలని తెలియజేశారు. వైసీపీ పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమం సన్నగిల్లుతుందని హెచ్చరించమని తెలియజేశారు. ప్రతి గ్రామ వార్డు సచివాలయాన్ని యూనిట్ గా తీసుకొని ఒక విశ్లేషణీయమైన వ్యక్తిని ఎంచుకోవాలని అన్నారు . అలాగే ఎల్లప్పుడూ జనాలకు అందుబాటులో ఉండాలని అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా సమాధానం చెప్పాలని తెలియజేసినట్లు సమాచారం. నేనేం చేయగలనో అంతవరకు చేశా ఇక ఇప్పుడు చేయాల్సిందంతా మీ చేతుల్లోనే ఉందంటూ నేతలకు జగన్ తెలియజేసినట్లుగా సమాచారం. ఈ విధంగా వచ్చే ఎన్నికల్లో జగన్ తన క్యాడర్ ను బలంగా సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది