Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి అరెస్ట్.. ముందడుగు వేసిన జగన్..!
ప్రధానాంశాలు:
Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి అరెస్ట్.. ముందడుగు వేసిన జగన్..!
Posani Krishna Murali : నటుడు పోసాని కృష్ణ మురళి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు TDP టీడీపీ అధినేత Chandrababu Naidu చంద్రబాబు, జనసేనాని Janasena పవన్ కళ్యాణ్ Pawan Kalyan, ఇతర నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. వీటిపై కూటమి ప్రభుత్వం రాగానే ఏపీలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అతడిని అరెస్ట్ కూడా చేశారు.

Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి అరెస్ట్.. ముందడుగు వేసిన జగన్..!
Posani Krishna Murali తలనొప్పులు..
పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు… అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకు వైసీపీ అధినేత జగన్ ys Jagan ఫోన్ చేసి పరామర్శించారు. పోసానికి పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు. ‘దేవుడు అంతా చూస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు అందరం తోడు ఉంటాం’ అని తెలిపారు.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించామని చెప్పారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదని చెప్పారు. పోసాని కృష్ణమురళికి వైసీపీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని ఆయన భార్యకు జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు Lawyers ఈ వ్యవహారాన్ని అప్పగించామని జగన్ ఆమెకు తెలిపారు. . కాగా, చంద్రబాబు, పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కటువుగా మోటు కామెంట్స్ చేశారు. ఇది ఆయన్ని ఇప్పుడు చిక్కుల్లో పడేసింది