
Ys Jagan : మనం ఓడిపోవడానికి కారణం అదే... వైఎస్ జగన్.. వీడియో !
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే అని పలు వాటిని ప్రస్తావించారు జగన్. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఒక సంవత్సరం పూర్తయ్యింది. అయితే ఈ క్రమంలోనే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని జగన్ ఆరోపించారు. ఈ తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాలేదని విమర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు మంచి చేయాల్సిన బదులు, దారి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని, ‘రెడ్ బుక్’ పాలన పేరుతో రాజకీయ విభజన, ప్రతీకారాలు, అణచివేత రాజ్యం కొనసాగుతోందని తెలిపారు.
Ys Jagan : మనం ఓడిపోవడానికి కారణం అదే… వైఎస్ జగన్.. వీడియో !
ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటింటికీ నాయకులను పంపి, ఓటర్లకు హామీలతో కూడిన బాండ్లు ఇచ్చి ప్రజలను నమ్మించారు. తాను అధికారంలోకి వచ్చాక తాను చేసిన బాండ్లలో పేర్కొన్న ప్రతి పథకాన్ని అమలు చేస్తానని ప్రమాణం చేశారు. అయితే ఏడాది పూర్తైనా ఈ హామీలలో ఒక్కదాన్ని కూడా అమలు చేయకపోవడం ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని జగన్ ఆరోపించారు. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలను బాండ్లలో చూపించి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, వసతి దీవెన, చెయూత, నేతన్న నేస్తం వంటి పథకాలపై వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ రంగం పూర్తిగా తిరోగమనంలోకి వెళ్లిందని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, ఉచిత బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలు కూడా ఇవ్వడంలేదని అన్నారు. ప్రజలు ఇప్పుడు తమకు ఇవ్వాల్సిన హామీలను గుర్తు చేస్తూ చంద్రబాబును ప్రశ్నించాలని, బాధ్యత వహించేలా ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.