Ys Jagan : కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జగన్ యాప్ వస్తుంది..!
Ys Jagan : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, రాజకీయ వేధింపులను నమోదు చేసేందుకు వైసీపీ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్టు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులపై అక్రమంగా కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Ys Jagan : కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జగన్ యాప్ వస్తుంది..!
ఈ క్రమంలో ఎవరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నా, ప్రభుత్వ అధికారులు లేదా కూటమి నేతలు బలవంతాలు చేస్తుంటే సంబంధిత వివరాలను యాప్ లో నమోదు చేయాలని జగన్ సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను డిజిటల్ ఫార్మాట్లో సేకరించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని వివరించారు. దీనిద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అధికార దుర్వినియోగాన్ని నిర్ధారించిన ఆధారాలుగా కూడా వాడే అవకాశముందని చెప్పారు.
తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక, ఈ యాప్‌లో నమోదైన ఫిర్యాదులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. ప్రజల భద్రత, న్యాయబద్ధత కోసం ఈ యాప్ ఒక సాధనంగా నిలవనుందని తెలిపారు. “ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరి గళాన్ని వినేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది” అని జగన్ పేర్కొన్నారు.
Monsoon Detox Drinks : మార్పులు సంభవిస్తే మన శరీరంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అయితే,సీజన్లను బట్టి శరీరం…
Kingdom Movie : టాలీవుడ్ Tollywood లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, vijay devarakonda , bhagya…
Red Food Benefits : కూరగాయలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న కూరగాయలు ఆరోగ్యానికి…
Shravana Masam 2025 : మహిళలు ఎంతో ఇష్టంగా శ్రావణమాసంలో ఆధ్యాత్మిక తో భావంతో నిండి,పూజలను చేస్తూ ఉంటారు. అయితే…
Asaduddin Owaisi : భారత్ vs పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా…
Fertility Food : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా వివాహం జరిగిన తరువాత మొదట కోరిక తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు.…
Prabhas Puri Jagannadh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్లలో ఒకడు పూరీ జగన్నాథ్…
Kuja Transit : 2025 వ సంవత్సరంలో జూలైలో 28న మొదటి సోమవారం రోజున కుజసంచారం జరిగింది. ఇది శ్రావణ…
This website uses cookies.