YS Jagan : పేర్లు రాసుకోండి... వారికి సినిమా చూపిస్తామంటూ జగన్ వార్నింగ్..!
YS Jagan : రాజంపేట మున్సిపాలిటీ, రామకుప్పం మండలం, మడకశిర మున్సిపాలిటీ, రొద్దం మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో భేటి అయిన జగన్.. అక్రమ కేసులతో వేధిస్తున్న అధికారులు, పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక విడిచిపెట్టేది లేదని, వారు ఎక్కడున్నా, సప్త సముద్రాల అవుతల ఉన్నా, రిటైర్ అయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారిని తప్పకుండా సినిమా చూపిస్తామని జగన్ హెచ్చరించారు.
YS Jagan : పేర్లు రాసుకోండి… వారికి సినిమా చూపిస్తామంటూ జగన్ వార్నింగ్..!
రాష్ట్రంలో విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నారని, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి, వాటిని చంద్రబాబుకు చూపి, నిలబడిన మీ అందరికీ మీ జగన్ హ్యాట్సాఫ్ అన్నారు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. కేవలం వైయస్సార్‌సీపీని ప్రేమించినందుకు, తనను అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధ, ఇబ్బందులు, వారిపై వేధింపులను చూస్తున్నానని జగన్ తెలిపారు.
అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానన్నారు. వారికి పూర్తి న్యాయం చేస్తానన్నారు. వారికి అడుగుడుగునా తోడుగా, అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదామన్నారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోమన్నారు. ఈరోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడని, టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుందని అడిగారు. చూస్తుండగానే ఏడాది గడిచిందని, కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయని జగన్ తెలిపారు. మనం అధికారంలోకి వచ్చాక, వారందరికీ సినిమా చూపిస్తా. అది మామూలుగా ఉండదన్నారు.
Chandrababu : ఏపీ కేబినెట్ AP Cabinet ఈరోజు (గురువారం) CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది.…
Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా భిన్నంగా వ్యవహరిస్తుంది. హింసను వదులుకోవడానికి…
Pakistan Youth : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్లో 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నందుకు భారత సైన్యం…
Samantha : నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అనే ప్రచారాలు జోరుగా…
Pakistan : పాక్కు భారత్ చుక్కలు చూపిస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక…
అమెజాన్, ఫ్లిప్ కార్ట్లలో ఒక్కోసారి బంపర్ ఆఫర్స్ పెడుతుంటారు. వాటి వలన కాస్ట్లీ ఫోన్స్ కూడా సరసమైన ధరలకి లభిస్తుంటాయి…
Summer : వేసవికాలం భరించలేనిది. మండే ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతాయి. మనమందరం ఎండ రోజులను…
Watermelon : దేశంలో వేసవి కాలం జోరుగా సాగుతోంది. ప్రతి రోజు గడిచేకొద్దీ వేడి పెరుగుతోంది. ఈ మండే వేసవి…
This website uses cookies.