Ys jagan : జగన్ పథకాలని మెచ్చుకున్న చంద్రబాబు.. సరికొత్త పంథాలో దూసుకుపోతున్న ఏపీ సీఎం..!
ప్రధానాంశాలు:
Ys jagan : జగన్ పథకాలని మెచ్చుకున్న చంద్రబాబు..సరికొత్త పంథాలో దూసుకుపోతున్న ఏపీ సీఎం..!
ఏపీలో రాజకీయం మరింత రంజుగా మారింది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ రాజకీయ నాయకులు జోరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. దాదాపుగా రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉండగా, వారే కాకుండా ఇతర ఓట్లని సైతం ప్రభావితం చేస్తారని అంటున్నారు. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి వ్యూహాత్మక తప్పిదాలతో వాలంటీర్ల ఆదరణను కొనసాగింప చేసుకునేందుకు ఇబ్బదులు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వాలంటీర్ల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాలంటీర్లందరికీ చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు.
Ys jagan : జగన్ మార్క్ రాజకీయం
ప్రజలకు సేవ చేసేలా ఉండే వాలంటీర్లకు ఎలాంటి సమస్యా ఉండదని , తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల నెలకు రూ. యాభై వేల వరకూ సంపాదించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తామని తెలియజేశారు. అయితే రాజీనామా లు చేసిన వాలంటీర్లకు అసలు చాన్స ్ఉండదు. వాలంటీర్లలో చాలా మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారని కూడా చంద్రబాబు అన్నారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై తాజాగా జగన్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. పిడుగురాళ్ళ సభలో మాట్లాడిన బాబు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని అంటున్నారు అంటే మా పాలన బాగుంది అని చెప్పినట్టే కదా అని అన్నారు.
వాలంటీర్లకు పది వేల రూపాయల పారితోషికం ఇస్తామని చంద్రబాబు చెబుతున్నాడంటే మేము ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ బాగున్నట్టే కదా అని ఆయన అన్నారు. వాలంటీర్ల మీద విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను చూస్తే చాలు చంద్రబాబు గుండెలలో రైళ్ళు పరిగెడుతున్నాయని జగన్ తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. గాడిదను చూపించి గుర్రం అని ప్రచారం చేయడం కూడా టీడీపీ అనుకూల మీడియాకే సాధ్యం అవుతుందంటూ జగన్ తనదైన శైలిలో పంచ్‌లు వేశారు.