YS Jagan : బిగ్ బ్రేకింగ్ : అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్..!
ప్రధానాంశాలు:
YS Jagan : బిగ్ బ్రేకింగ్ : అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్..!
YS Jagan : ఆంధ్రప్రదేశ్ andhra pradesh అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి అనే దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ 28న కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

YS Jagan : బిగ్ బ్రేకింగ్ : అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్..!
ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారా? అని సర్వత్రా చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో సమావేశాలకు హాజరు కావడంపై వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు.
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పక హాజరు కావాలని ఆదేశం
అంతేకాదు అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పక హాజరు కావాలని వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఎల్లుండి ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. శాసన సభ, మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు, మిర్చి రైతుల బాధలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లుగా సమాచారం.