
Vijayasai Reddy : జగన్ మారిపోయాడా..? విజయసాయి మాటల్లో అర్ధం ఏంటి..?
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల హీట్ పెరుగుతున్న సమయంలో మద్యం స్కాం అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయిరెడ్డి అప్పట్లో మద్యం కుంభకోణంపై తాను అన్నీ తెలిసినవాడినని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన్ను సీఐడీ విచారణకు పిలిచి, ఆయన ఇచ్చిన వాంగ్మూలం పార్టీ లోపల కలకలం రేపింది. దీంతో వైసీపీ వర్గాల్లో ఆయనపై అసంతృప్తి పెరిగింది.
Vijayasai Reddy : జగన్ మారిపోయాడా..? విజయసాయి మాటల్లో అర్ధం ఏంటి..?
తాజాగా ప్రెస్ మీట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..విజయసాయి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ పదవికి మూడున్నరేళ్ల ముందు రాజీనామా చేసి, ప్రతిపక్ష కూటమిని ఖుషీ చేయాలనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి అలా వ్యవహరించారని జగన్ విమర్శించారు. ఆయనను “రోగ్ ఎంపీ”గా పేర్కొంటూ, అలాంటి వ్యక్తి చేసే వ్యాఖ్యలకు ఎటువంటి విలువ ఉండదని మండిపడ్డారు. అంతేగాక, ఆయన తెలుగుదేశం పార్టీకి లొంగిపోయారని ఘాటు ఆరోపణలు చేశారు.
జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించినట్లుగా ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో తన స్వభావం ఎప్పటికీ మారదని, రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మూడు దశాబ్దాల అనుబంధం ఉందని విజయసాయిరెడ్డి చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై విజయసాయిరెడ్డి అధికారికంగా స్పందిస్తూ, ఆ ప్రకటన తాను విడుదల చేసినది కాదని ఖండించారు. తన తరఫు నుండి వచ్చే అన్ని ప్రకటనలు తన అధికారిక ‘ఎక్స్’ (Twitter) ఖాతా ద్వారానే వెలువడతాయని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదంపై విజయసాయిరెడ్డి ఈ దశలో స్పందించేందుకు ఆసక్తి చూపట్లేదన్న అభిప్రాయం బలపడుతోంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.