YS Jagan – YS Sharmila : జగన్.. షర్మిల మధ్య.. సంది కుదిర్చేది ఎవరు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan – YS Sharmila : జగన్.. షర్మిల మధ్య.. సంది కుదిర్చేది ఎవరు..?

 Authored By ramu | The Telugu News | Updated on :21 August 2024,9:00 am

YS Jagan – YS Sharmila : ఏపీలో గత ఐదేళ్లు పరిపాలించిన వైఎస్ జగన్ ఓటమికి కారణాలు ఎన్నో ఉన్నా అందులో షర్మిల కూడా ఒకరని చెప్పొచ్చు. 2019 లో అన్న వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చే వరకు ఆయనకు సపోర్ట్ గా ఉన్న షర్మిల అధికారం లోకి వచ్చాక అన్న లో మార్పులను చూసి తెలంగాణాలో వైఎస్సార్ సెంటిమెంట్ తో వైఎస్సార్ తెలంగాణా పార్టీ పెట్టింది. ఐతే అది ఎన్నో రోజులు నడపకుండానే కాంగ్రెస్ లోకి విలీనం చేసింది. ఇప్పుడు ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల తన టార్గెట్ జగన్ అనేలా ఎటాక్ చేస్తుంది.

జగన్ ఓ పక్క కూటమి చేస్తున్న పనులను ఎలా ఫేస్ చేయాలో ఆలోచిస్తుంటే ఇటు చెల్లెమ్మ షర్మిల కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తననే టార్గెట్ చేసింది. అంతేకాదు జరిగిన ఎన్నికల్లో వైసీపీ కి అంత నష్టం జరిగింది అంటే అది షర్మిల వల్లే. ఆమె వల్లే రాయలసీమలో కూడా జగన్ పార్టీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ గెలవకపోయినా చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసింది. ఐతే అధికారంలో ఉన్న కూటమితోనే కాదు అటు కేంద్రంలో ఉన్న బీజేపీతో కూడా జగన్ కు ఇబ్బందే. అందుకే అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇండియా కూటమిలో కలవాల్సిందే.

YS Jagan YS Sharmila

YS Jagan – YS Sharmila : అన్నా చెల్లెల మధ్య సంధి కోసం..

ఐతే ఇండియా కూటమికి కాంగ్రెస్ పెద్దన్న.. సో జగన్ అందులోకి రావాలంటే మాత్రం కాంగ్రెస్ అడ్డు పడే ఛాన్స్ ఉంది. అందుకే ఏపీకి చెందిన ఒక సీనియర్ నేత అటు జగన్ ను.. ఇటు షర్మిల మధ్య సంది కుదిర్చే ఏర్పాట్లు చేస్తున్నాడట. అదే జరిగితే మాత్రం ఇండియా కూటమికి సపోర్ట్ గా జగన్ చేరిపోతాడు. సో జగన్ మీద కాంగ్రెస్ కూడా ఎంతోకొంత ప్రేమ చూపించే ఛాన్స్ ఉంటుంది. ఈ విధానానికి షర్మిక అడ్డు రాకుండా చెల్లిని కూడా కన్విన్స్ చేసేలా సంప్రదింపులు చేస్తున్నారట. ఐతే కాంగ్రెస్ లోకి వైసీపీ విలీనం కాకుండా కాంగ్రెస్ సపోర్ట్ తో వైసీపీ నిలబడేలా చేసుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ షర్మిల మళ్లీ కలిస్తే మాత్రం కూటమిని టార్గెట్ చేయడం కాస్త ఈజీ అవుతుంది. మరి జగన్ కలవాలనుకుంటున్నా షర్మిల కలుస్తుందా కలవనిస్తుందా అన్నది చూడాలి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది