YS Sharmila : సునీత‌ని ఏం చేస్తారో అని భ‌య‌మేస్తుంది.. వైఎస్ ష‌ర్మిళ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : సునీత‌ని ఏం చేస్తారో అని భ‌య‌మేస్తుంది.. వైఎస్ ష‌ర్మిళ కామెంట్స్

 Authored By ramu | The Telugu News | Updated on :4 April 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Sharmila : సునీత‌ని ఏం చేస్తారో అని భ‌య‌మేస్తుంది.. వైఎస్ ష‌ర్మిళ కామెంట్స్

YS Sharmila : వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉండగా మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ‘‘ మా బాబాయ్‌ హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె సునీతారెడ్డికి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది’’ అని ష‌ర్మిళ పేర్కొంది.

YS Sharmila సునీత‌ని ఏం చేస్తారో అని భ‌య‌మేస్తుంది వైఎస్ ష‌ర్మిళ కామెంట్స్

YS Sharmila : సునీత‌ని ఏం చేస్తారో అని భ‌య‌మేస్తుంది.. వైఎస్ ష‌ర్మిళ కామెంట్స్

YS Sharmila ష‌ర్మిళ స్ట‌న్నింగ్ కామెంట్స్..

ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని అన్నారు. వివేకా హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డిని సునీత, ఆమె భర్త కలసి హత్య చేసినట్లుగా తప్పుడు రిపోర్టు తయారుచేసి దానిపై అధికారులతో సంతకాలు అవినాశ్‌ సంతకాలు చేయించినట్టు అందులో ఉంది.

అవినాశ్‌రెడ్డి బెయిల్‌ మీద బయట ఉండటం వల్లే సాక్ష్యాలను తారుమారు చేయగలుగుతున్నారు అని షర్మిల తెలిపారు. పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల విషయంలో వైసీపీ రాజకీయం చేస్తోందని ఆమె విమర్శించారు. ఇదంతా బీజేపీ కుట్ర. గతంలోనూ బీజేపీ కోసం ఆ పార్టీ దత్తపుత్రుడు జగన్మోహన్‌రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు అని ష‌ర్మిళ పేర్కొంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది