Ys Sharmila : వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన అప్పుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ష‌ర్మిల‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Sharmila : వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన అప్పుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ష‌ర్మిల‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys Sharmila : వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన అప్పుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ష‌ర్మిల‌..!

Ys Sharmila : ఇప్పుడు ఏపీ రాజ‌కీయాలు చాలా హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా జ‌గ‌న్‌ని టార్గెట్ చేసి ఒక‌వైపు కూట‌మి, మ‌రోవైపు కాంగ్రెస్ ముప్ప‌తిప్ప‌లు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల అయితే జ‌గ‌న్‌ని ఓ రేంజ్‌లో విమ‌ర్శిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరుఫున కడప లోక్ సభ అభ్యర్థిగా షర్మిల నామినేషన్ దాఖలు చేసిన ష‌ర్మిల ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి అని తెలియ‌జేసింది. వైఎస్ షర్మిల తనకు రూ.182.82 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ.9.29 కోట్లు కాగా.. చరాస్తులు రూ.123.26 కోట్లని తెలిపారు. అలాగే తన వద్ద రూ.3.69 కోట్ల విలువైన బంగారు, రూ.4.61 కోట్ల విలువైన జెమ్ స్టోన్స్ ఆభరణాలు ఉన్నట్లు షర్మిల తన ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించారు.

Ys Sharmila : బిల్డ‌ప్ ఇస్తున్నారు..

ఇక అప్పుల విషయానికి వస్తే.. తన అన్న, వైఎస్ జగన్ వద్ద రూ.82.58 కోట్లు అప్పు తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది . అలాగే వైఎస్ జగన్ సతీమణి, తన వదిన వైఎస్ భారతి రెడ్డి వద్ద రూ.19.56 లక్షలు అప్పు తీసుకున్నార‌ని రాసుకొచ్చింది. ఇక వైఎస్ షర్మిల భర్త.. బ్రదర్ అనికల్ కుమార్.. షర్మిల తల్లి.. తన అత్తగారైన వైఎస్ విజయమ్మ వద్ద 40 లక్షలు అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్లో ఉంది. అలాగే తన వద్ద కూడా బ్రదర్ అనిల్ 30 కోట్ల వరకూ అప్పు తీసుకున్నట్లు షర్మిల తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే సోదరుడు జగన్ తనకు అప్పు ఇచ్చిన విష‌యంపై షర్మిల ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. సమాజంలో నిజానికి చెల్లెలికి ఏ అన్న అయినా వాట ఇవ్వాలి. అది ఆడబిడ్డ హక్కు. ఆడబిడ్డ కు ఇవ్వాల్సిన హక్కు అన్నకు ఉంది.

Ys Sharmila వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన అప్పుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ష‌ర్మిల‌

Ys Sharmila : వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన అప్పుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ష‌ర్మిల‌..!

మేనమామగా కూడా భాధ్యత ఉంది. తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేది మేనమామ కాబట్టి. ఇది సహజంగా అందరు పాటించే నియమం. కొందరు చెల్లెళ్ళకు ఇవ్వాల్సిన అస్తి వాటాను తమ వాటాగా భావిస్తారు. తామేదో చెల్లెళ్ళకు గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ఒక్క కొసరు చెల్లెళ్ళకు ఇచ్చి అదికూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తారు. ఇది వాస్తవం…ఇది కుటుంబానికి మొత్తం తెలుసు…దేవుడికి తెలుసు” అంటూ వైఎస్ షర్మిల ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. ఇప్పుడు ఆమె కామెంట్స్ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది