YS Sunitha : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ వై.యస్ వివేకానంద రెడ్డి కేసు సరికొత్త పరిణామాలను తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలోనే తన తండ్రి చావుకు కారణం వీరే అంటూ వివేకానంద రెడ్డి కూతురు వైయస్ సునీత సాక్షాలతో సహా నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైయస్ సునీతకు మద్దతుగా వైయస్ షర్మిల కూడా గొంతు వినిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా వీరిద్దరూ కలిసి జగన్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే వై.యస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని జగన్ కాపాడుతున్నాడంటూ , అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని హంతకులను దగ్గరకు తీసుకుంటున్నాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ నిందితులలో ప్రధాన నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేరుస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలలో పలు సందర్భాలలో అవినాష్ రెడ్డి పైతీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వై.యస్ సునీత తాజాగా మరోసారి సాక్షాలతో సహా నిరూపించే ప్రయత్నాలు చేశారు.ఈ నేపథ్యంలోనే ఇటీవల వైయస్ వివేకానంద హత్య కేసు పై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించిన సునీత దీనిలో అంతకులైన వారిని పట్టించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే గూగుల్ టేక్ అవుట్ ద్వారా కొన్ని సాక్షాలను ఆమె మీడియా ముందు పెట్టారు. ఇక దీనిలో భాగంగా గూగుల్ టెక్ అవుట్ గురించి ఆమె వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ google టెక్ అవుట్ అనేది google maps తో అనుసంధానమై ఉంటుందని తెలియజేశారు. ఇక ఈ google టేక్ అవుట్ ఉపయోగించి ఎవరు ఎక్కడ ఉన్నారనేది చాలా సులువుగా కనుక్కోవచ్చని తెలిపారు. మీ ఫోన్ లో గూగుల్ యాప్ ని కలిగి ఉండి మీరు ఎక్కడెక్కడికి వెళ్లినా సరే అది అవన్నీ రికార్డ్ చేస్తుందని తెలిపారు. ఇక ఈ google టేక్ అవుట్ ద్వారా ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఉన్నారనేది చాలా సులువుగా తెలుసుకోవచ్చు అని వివరించారు. ఇలాంటి సమాచారాలను పోలీసులు చాలా సులువుగా పొందగలరని వివరించారు. ఈ నేపథ్యంలోనే వివేకానంద రెడ్డిని హత్య చేసిన సునీల్ యాదవ్ అనే వ్యక్తి హత్య జరిగిన రోజు రాత్రి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లుగా గూగుల్ టేక్ అవుట్ ద్వారా సేకరించిన సమాచారాలను ఆమె బయటపెట్టారు. అంతేకాక ఆరోజు అతను ఎక్కడెక్కడ తిరగాడు అనే విషయాలను కూడా ఆమె తెలియజేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి సునీత చేస్తున్న ఈ ప్రయత్నాలు రాబోయే ఎన్నికలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
This website uses cookies.