YS Sunitha : వివేకానంద రెడ్డి హత్య కేసు లో సాక్షాలతో మీడియా ముందుకు వచ్చిన వై.యస్ సునీత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sunitha : వివేకానంద రెడ్డి హత్య కేసు లో సాక్షాలతో మీడియా ముందుకు వచ్చిన వై.యస్ సునీత

 Authored By ramu | The Telugu News | Updated on :15 April 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Sunitha : వివేకానంద రెడ్డి హత్య కేసు లో సాక్షాలతో మీడియా ముందుకు వచ్చిన వై.యస్ సునీత

YS Sunitha : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ వై.యస్ వివేకానంద రెడ్డి కేసు సరికొత్త పరిణామాలను తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలోనే తన తండ్రి చావుకు కారణం వీరే అంటూ వివేకానంద రెడ్డి కూతురు వైయస్ సునీత సాక్షాలతో సహా నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైయస్ సునీతకు మద్దతుగా వైయస్ షర్మిల కూడా గొంతు వినిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా వీరిద్దరూ కలిసి జగన్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే వై.యస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని జగన్ కాపాడుతున్నాడంటూ , అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని హంతకులను దగ్గరకు తీసుకుంటున్నాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ నిందితులలో ప్రధాన నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేరుస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలలో పలు సందర్భాలలో అవినాష్ రెడ్డి పైతీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వై.యస్ సునీత తాజాగా మరోసారి సాక్షాలతో సహా నిరూపించే ప్రయత్నాలు చేశారు.ఈ నేపథ్యంలోనే ఇటీవల వైయస్ వివేకానంద హత్య కేసు పై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించిన సునీత దీనిలో అంతకులైన వారిని పట్టించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే గూగుల్ టేక్ అవుట్ ద్వారా కొన్ని సాక్షాలను ఆమె మీడియా ముందు పెట్టారు. ఇక దీనిలో భాగంగా గూగుల్ టెక్ అవుట్ గురించి ఆమె వివరించారు.

YS Sunitha వివేకానంద రెడ్డి హత్య కేసు లో సాక్షాలతో మీడియా ముందుకు వచ్చిన వైయస్ సునీత

YS Sunitha : వివేకానంద రెడ్డి హత్య కేసు లో సాక్షాలతో మీడియా ముందుకు వచ్చిన వై.యస్ సునీత

YS Sunitha : సాక్షాలతో సహా బయట పెట్టిన సునీత…

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ google టెక్ అవుట్ అనేది google maps తో అనుసంధానమై ఉంటుందని తెలియజేశారు. ఇక ఈ google టేక్ అవుట్ ఉపయోగించి ఎవరు ఎక్కడ ఉన్నారనేది చాలా సులువుగా కనుక్కోవచ్చని తెలిపారు. మీ ఫోన్ లో గూగుల్ యాప్ ని కలిగి ఉండి మీరు ఎక్కడెక్కడికి వెళ్లినా సరే అది అవన్నీ రికార్డ్ చేస్తుందని తెలిపారు. ఇక ఈ google టేక్ అవుట్ ద్వారా ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఉన్నారనేది చాలా సులువుగా తెలుసుకోవచ్చు అని వివరించారు. ఇలాంటి సమాచారాలను పోలీసులు చాలా సులువుగా పొందగలరని వివరించారు. ఈ నేపథ్యంలోనే వివేకానంద రెడ్డిని హత్య చేసిన సునీల్ యాదవ్ అనే వ్యక్తి హత్య జరిగిన రోజు రాత్రి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లుగా గూగుల్ టేక్ అవుట్ ద్వారా సేకరించిన సమాచారాలను ఆమె బయటపెట్టారు. అంతేకాక ఆరోజు అతను ఎక్కడెక్కడ తిరగాడు అనే విషయాలను కూడా ఆమె తెలియజేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి సునీత చేస్తున్న ఈ ప్రయత్నాలు రాబోయే ఎన్నికలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది