Kesineni Nani – YCP : కేశినేని నానికి ఎంపీ టికెట్ ప్రామిస్ చేసిన వైసీపీ?
Kesineni Nani – YCP : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం మాత్రమే ఉంది. ఇప్పటి నుంచే పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అయితే.. ప్రస్తుతం రాజకీయాలన్నీ విజయవాడ కేంద్రంగానే జరుగుతున్నాయి. దానికి కారణం.. విజయవాడ ఎంపీ కేశినేని నాని. అవును.. ఆయన ప్రస్తుతం వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. ఆయన టీడీపీ నుంచి గెలిచిన ఎంపీ. కానీ.. వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఆయన టీడీపీలో యాక్టివ్ గా లేరు. టీడీపీలో కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు.
కానీ.. తాజాగా ఆయన వైసీపీ ఎమ్మెల్యేను మెచ్చుకున్నారు. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఎన్నికల వేళ టీడీపీ ఎంపీ అలా మాట్లాడటంతో టీడీపీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు నియోజకవర్గంలో బాగా పని చేస్తున్నారని కేశినేని మెచ్చుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీపై, వైసీపీ ప్రభుత్వంపై ఒక్కసారిగా ప్రశంసలు కురిపించడం దేనికి నిదర్శనం. ఒకవేళ విజయవాడ ఎంపీ సీటును వైసీపీ నుంచి కేశినేని నాని ఆశిస్తున్నారా? వైసీపీ టికెట్ కన్ఫమ్ చేసిందా? లేక టీడీపీ నుంచి కేశినేనికి ఎంపీ టికెట్ హామీ దక్కలేదా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Kesineni Nani – YCP : టీడీపీ ముఖ్య నేతలతో రాజకీయంగా నానికి పడదు
టీడీపీ ముఖ్యనేతలు దేవినేని ఉమా, బోండా ఉమా, బుద్ధా వెంకన్న తదితరులతో కేశినేని నానికి పడదు. నిజానికి ఆయన ముక్కుసూటి మనిషి. చాలాకాలంగా టీడీపీ ముఖ్యనేతలతో విభేదాలు ఉండటంతో ఆయనకు టీడీపీ నుంచి ఎంపీ టికెట్ వస్తుందా? లేదా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే వైసీపీ వైపు కేశినేని మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ కేశినేని నాని రచ్చ రచ్చ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.