Women : మహిళలకి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. పదో తరగతి పాస్ అయితే అకౌంట్‌లోకి రూ.7 వేలు
ప్రధానాంశాలు:
Women : మహిళలకి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. పదో తరగతి పాస్ అయితే అకౌంట్‌లోకి రూ.7 వేలు
Women : ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుంది. మహిళల కోసం అనేక ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తెస్తుంటుంది. ఆ పథకంలోకి వస్తుంది భీమా సఖి యోజన. ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు 7వేల రూపాయలు అందించనున్నారు. బీమా సఖి యోజన పథకాన్ని ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రారంభించారు.

Women : మహిళలకి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. పదో తరగతి పాస్ అయితే అకౌంట్‌లోకి రూ.7 వేలు
Women మంచి పాలసి..
ఈ పథకం ద్వారా మహిళలకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేస్తారు. పదో తరగతి పాసైన వాళ్ళు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉండాలి. బీమా సఖి యోజన పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకానికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం కోసం వయసు ధ్రువీకరణ పత్రం, చిరునామా ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్టు సైజ్ ఫోటో కావల్సి ఉంటుంది. ఎల్ఐసి ఈ పథకాన్ని నిర్వహిస్తుండగా, మహిళలకు ఎల్ఐసీ ఏజెంట్లుగా ప్రత్యేక శిక్షణ, మొదటి మూడు సంవత్సరాలకు స్కాలర్‌షిప్ ఇస్తారు. స్కాలర్ షిప్ ఒక్కో ఏడాదికి ఒక్కో రకంగా ఉంటుంది. మహిళలు వార్షిక పనితీరు లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. వారు అమ్మిన పాలసీల్లో 65శాతం వరకు కొనసాగాలి.