Bank Loan : బ్యాంకు లోన్ క్లోజ్ చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. లేక‌పోతే మీ ప‌ని అంతే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bank Loan : బ్యాంకు లోన్ క్లోజ్ చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. లేక‌పోతే మీ ప‌ని అంతే..!

 Authored By ramu | The Telugu News | Updated on :31 May 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Bank Loan : బ్యాంకు లోన్ క్లోజ్ చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. లేక‌పోతే మీ ప‌ని అంతే..!

Bank Loan : ఇల్లు, విద్య, వాహనం లేదా వ్యక్తిగత అవసరాల కోసం చాలా మంది బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటారు. ఈ రుణాలను ప్రతి నెల ఈఎంఐలుగా చెల్లిస్తూ ఉండటం సహజం. ఒకసారి ఈఎంఐలు పూర్తవడంతో లేదా ముందస్తుగా మొత్తం చెల్లించడంతో రుణం పూర్తిగా ముగుస్తుంది. అయితే రుణం ముగిసిన తర్వాత కొన్ని ముఖ్యమైన పత్రాలను బ్యాంక్ నుండి తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి భవిష్యత్తులో ఏదైనా ఆస్తి విక్రయం, పునఃరుణం లేదా ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో కీలకంగా ఉపయోగపడతాయి.

Bank Loan బ్యాంకు లోన్ క్లోజ్ చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు లేక‌పోతే మీ ప‌ని అంతే

Bank Loan : బ్యాంకు లోన్ క్లోజ్ చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. లేక‌పోతే మీ ప‌ని అంతే..!

Bank Loan : బ్యాంకు లోన్ క్లోజ్ చేయబోతున్నారా..? అయితే మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ తప్పక ఉండాల్సిందే..!!

రుణం పూర్తయ్యాక మొదటిగా తీసుకోవాల్సినది నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC). ఇది మీరు బ్యాంక్ వద్ద ఎలాంటి పెండింగ్ బాకీలు లేకుండా రుణాన్ని పూర్తిగా చెల్లించినట్లు ధృవీకరించేది. అలాగే లోన్ క్లోజర్ లెటర్ కూడా తీసుకోవాలి. ఇది బ్యాంక్ నుండి అధికారికంగా రుణం పూర్తయిందని నిర్ధారించే లెటర్‌. ఇంకా మీరు చివరిసారిగా చేసిన చెల్లింపుల వివరాలు ఉండే ఫైనల్ రీపేమెంట్ స్టేట్‌మెంట్ తీసుకోవడం కూడా అవసరం. ఈ డాక్యుమెంట్ లో మొత్తం చెల్లింపుల చరిత్ర ఉంటుంది.

ఈ డాక్యుమెంట్లతో పాటు, మీరు రుణం తీసుకునేటప్పుడు బ్యాంకుకు గారంటీగా ఇచ్చిన ఆస్తి పత్రాలు, ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ బ్యాంక్ నుండి తిరిగి తీసుకోవాలి. దీన్ని కోలాటరల్ రిలీజు అని పిలుస్తారు. కొన్నిసార్లు మనం అవసరమైన అవగాహన లేకుండా ఈ పత్రాలను తీసుకోవడం మర్చిపోతాం. దీని వల్ల భవిష్యత్తులో ఆస్తి విక్రయం లేదా ఇతర లావాదేవీలలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి లోన్ ముగిసిన వెంటనే పై చెప్పిన అన్ని పత్రాలను తీసుకుని భద్రపర్చుకోవాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది