Loan: ఇక బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..72 గంట‌ల్లో రూ. 5 ల‌క్ష‌ల లోన్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Loan: ఇక బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..72 గంట‌ల్లో రూ. 5 ల‌క్ష‌ల లోన్‌..!

 Authored By suma | The Telugu News | Updated on :26 January 2026,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Loan: ఇక బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..72 గంట‌ల్లో రూ. 5 ల‌క్ష‌ల లోన్‌..!

Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ తిరగాలి అన్నది అందరికీ తెలిసిన విషయమే. డాక్యుమెంట్లు, గ్యారంటీలు, రోజుల తరబడి ఎదురుచూపులు ఇవన్నీ చాలామందికి పెద్ద తలనొప్పి. కానీ టెక్నాలజీ రోజురోజుకీ సులభ మార్గాలు చూపిస్తోంది. అదే కోవలో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే ఇప్పుడు లోన్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజూ బిల్లులు, రీచార్జ్‌లు, ట్రాన్స్‌ఫర్‌ల కోసం ఉపయోగించే అదే యాప్‌లో, ఒక సింగిల్ క్లిక్‌తో డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి రావడం ఇప్పుడు సాధ్యమైంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది నిజంగా ఉపశమనం కలిగించే ఫీచర్‌గా చెప్పుకోవచ్చు.

 

Rs 5 lakh loan in 72 hours

Loan: ఇక బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..72 గంట‌ల్లో రూ. 5 ల‌క్ష‌ల లోన్‌..!

Loan: ఎంత మొత్తం లోన్?.. వడ్డీ, కాలపరిమితి వివరాలు

ఫోన్‌పే వివిధ బ్యాంకులు NBFCలతో భాగస్వామ్యం చేసుకుని వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. వినియోగదారుడి క్రెడిట్ ప్రొఫైల్ ఆదాయం Credit Profile Income ఆధారంగా కనీసం రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు లోన్ లభిస్తుంది. ఇవి అన్‌సెక్యూర్డ్ లోన్స్ కావడంతో బంగారం, ఇల్లు లేదా ఇతర ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న వ్యాపార ఖర్చులు వైద్య చికిత్సలు కుటుంబ అవసరాలు లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఈ లోన్‌ను వినియోగించుకోవచ్చు. లోన్ ఆమోదం పొందిన తర్వాత సాధారణంగా 24 నుంచి 72 గంటల్లోపు డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. రీపేమెంట్ కాలపరిమితిని 12 నెలల నుంచి 60 నెలల వరకు మీ సౌకర్యానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. వడ్డీ రేట్లు ఏడాదికి సుమారు 11.30 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ప్రాసెసింగ్ ఫీజు నెలవారీ EMI ఎంత పడుతుంది అనే వివరాలను అప్లై చేసే దశలోనే ఫోన్‌పే స్పష్టంగా చూపిస్తుంది. దాచిన చార్జీలు లేకపోవడం ఈ సర్వీసుకు మరో ప్లస్ పాయింట్.

Loan: అర్హతలు..అప్లై చేసే విధానం

ఫోన్‌పే లోన్‌కు అప్లై చేయాలంటే కొన్ని ప్రాథమిక అర్హతలు ఉండాలి. వయస్సు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు కనీసం రూ.15,000 స్థిరమైన ఆదాయం అవసరం. సిబిల్ స్కోర్ 650 కంటే ఎక్కువగా ఉంటే లోన్ ఆమోదం పొందే అవకాశాలు మరింత పెరుగుతాయి. ముఖ్యంగా స్థిరమైన ఉద్యోగం లేదా నిరంతర ఆదాయం ఉన్నవారికి బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తాయి. ఈ లోన్ ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలోనే జరుగుతుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్స్ ఉంటే సరిపోతుంది. అప్లై చేయాలంటే ముందుగా ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి “లోన్స్” విభాగంలోకి వెళ్లాలి. అక్కడ వ్యక్తిగత వివరాలు నమోదు చేసి కావాల్సిన లోన్ మొత్తం మరియు రీపేమెంట్ కాలాన్ని ఎంచుకోవాలి. చివరగా అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయగానే అప్లికేషన్ పూర్తవుతుంది.
ఇక బ్యాంకుల చుట్టూ తిరగకుండా పేపర్‌వర్క్ ఒత్తిడి లేకుండా వేగంగా డబ్బు అందించే ఈ ఫోన్‌పే లోన్ ఫీచర్ అత్యవసర సమయాల్లో చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంది.

 

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది