Bank Loan : బ్యాంకు లోన్ క్లోజ్ చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. లేకపోతే మీ పని అంతే..!
Bank Loan : ఇల్లు, విద్య, వాహనం లేదా వ్యక్తిగత అవసరాల కోసం చాలా మంది బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటారు. ఈ రుణాలను ప్రతి నెల ఈఎంఐలుగా చెల్లిస్తూ ఉండటం సహజం. ఒకసారి ఈఎంఐలు పూర్తవడంతో లేదా ముందస్తుగా మొత్తం చెల్లించడంతో రుణం పూర్తిగా ముగుస్తుంది. అయితే రుణం ముగిసిన తర్వాత కొన్ని ముఖ్యమైన పత్రాలను బ్యాంక్ నుండి తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి భవిష్యత్తులో ఏదైనా ఆస్తి విక్రయం, పునఃరుణం లేదా ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో కీలకంగా ఉపయోగపడతాయి.
Bank Loan : బ్యాంకు లోన్ క్లోజ్ చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. లేకపోతే మీ పని అంతే..!
రుణం పూర్తయ్యాక మొదటిగా తీసుకోవాల్సినది నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC). ఇది మీరు బ్యాంక్ వద్ద ఎలాంటి పెండింగ్ బాకీలు లేకుండా రుణాన్ని పూర్తిగా చెల్లించినట్లు ధృవీకరించేది. అలాగే లోన్ క్లోజర్ లెటర్ కూడా తీసుకోవాలి. ఇది బ్యాంక్ నుండి అధికారికంగా రుణం పూర్తయిందని నిర్ధారించే లెటర్. ఇంకా మీరు చివరిసారిగా చేసిన చెల్లింపుల వివరాలు ఉండే ఫైనల్ రీపేమెంట్ స్టేట్‌మెంట్ తీసుకోవడం కూడా అవసరం. ఈ డాక్యుమెంట్ లో మొత్తం చెల్లింపుల చరిత్ర ఉంటుంది.
ఈ డాక్యుమెంట్లతో పాటు, మీరు రుణం తీసుకునేటప్పుడు బ్యాంకుకు గారంటీగా ఇచ్చిన ఆస్తి పత్రాలు, ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ బ్యాంక్ నుండి తిరిగి తీసుకోవాలి. దీన్ని కోలాటరల్ రిలీజు అని పిలుస్తారు. కొన్నిసార్లు మనం అవసరమైన అవగాహన లేకుండా ఈ పత్రాలను తీసుకోవడం మర్చిపోతాం. దీని వల్ల భవిష్యత్తులో ఆస్తి విక్రయం లేదా ఇతర లావాదేవీలలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి లోన్ ముగిసిన వెంటనే పై చెప్పిన అన్ని పత్రాలను తీసుకుని భద్రపర్చుకోవాలి.
Fish Venkat : టాలీవుడ్ నటుడు , కమెడియన్ ఫిష్ వెంకట్ 53 Fish Venkat passed away చందానగర్…
Divi Vadthya : దివి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న అందాల ముద్దుగుమ్మ. కేవలం అందంతోనే కాదు,…
Shyamala : మాజీ మంత్రి ఆర్కే రోజా పై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలను వైయస్సార్…
Sania Mirza : టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మళ్లీ పెళ్లిపీటలెక్కబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…
My Baby Movie Review : కరోనా తర్వాత ఓటిటి చిత్రాలు అలాగే తమిళ్ , మలయాళ చిత్రాలు తెలుగు…
Love Marriage : చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె గ్రామానికి చెందిన యువకుడు వంశీ (24) మరియు యువతి నందిని…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు farmers ఊరటనిచ్చే శుభవార్త ఈరోజు వెలువడే ఛాన్స్ ఉంది. పీఎం…
Kothapallilo Okappudu Movie Review : ఒకప్పుడు పెద్ద సినిమాలు బాగుండేవి..ప్రేక్షకులు సైతం పెద్ద హీరోల చిత్రాలకు మొగ్గు చూపించేవారు.…
This website uses cookies.