Home » Business » Ashadam Effect Gold Prices Are Falling
Business

Today Gold Price : ఆషాడం ఎఫెక్ట్ : బంగారం ధర తగ్గుముఖం.. ఈరోజు తులం ఎంతంటే.?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 23, 2025 1:12 pm
Advertisement

Today Gold Price : బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు జూన్ 23న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,740 ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.92,340 పలికింది. అలాగే వెండి ధర కూడా కిలోకు రూ.1,19,900 గా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి బంగారం ధర దాదాపు రూ.75,000 ఉన్నది. అంటే ఏడాది వ్యవధిలో బంగారం ధర దాదాపు రూ.25,000 పెరిగిందని చెప్పవచ్చు. ఈ పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలకు బంగారం కొనుగోలు చేయడం కష్టంగా మారింది.

Advertisement

Today Gold Price : ఆషాడం ఎఫెక్ట్ : బంగారం ధర తగ్గుముఖం.. ఈరోజు తులం ఎంతంటే.?

Today Gold Price : ఈరోజు (జూన్ 23) బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే !!

బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణం అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య పరిస్థితులే. స్టాక్ మార్కెట్లు పతనం కావడం, అంతర్జాతీయంగా ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం వంటి అంశాలు ఇన్వెస్టర్లలో భయం రేకెత్తిస్తున్నాయి. ఇక బంగారం ధరలు పెరిగి పోవడంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం సామాన్యులకు దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేసే అవసరం ఏర్పడింది. తరుగు, మజూరీ, జీఎస్టీ లాంటి అదనపు చార్జీలు కలిపితే ఈ ధర మరింత పెరుగుతోంది. త్వరలోనే అయితే ఆషాడ మాసం ప్రారంభం కానుంది. వివాహాలు తక్కువగా జరిగే ఈ సమయంలో బంగారం డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. దీంతో పసిడి ప్రియులు ధరలు ఎంత తగ్గుతాయో అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Advertisement

ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100,740గా ఉంది. ఈ రేటు నిన్నటితో పోల్చుకుంటే రూ. 10 తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 92,340కి చేరింది. ఇదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100,890కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 92,490గా ఉంది.అలాగే ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ.1,09,900 స్థాయికి చేరుకుంది. ఇక చెన్నై, హైదరాబాద్‎లో రూ. 1,19,900గా ఉంది. మరోవైపు పూణేలో రూ.109,900లో ఉండగా, బెంగళూరు, వడోదర, కేరళ, ఢిల్లీలో కూడా రూ.109,900 స్థాయిలో ఉంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి