Guntur Sp : సింగయ్య మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ.. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తాను..!
Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి చనిపోవటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఈ విషయాన్ని ఆదివారం రాత్రి తెలిపారు. సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి మరణించాడని వైరల్ అవుతోన్న వీడియో ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Guntur Sp : సింగయ్య మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ.. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తాను..!
ఆరోజు నాకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకే నేను చెప్పాను. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్లీ క్లారిటీ ఇస్తానని చెప్పాను. దర్యాప్తులో జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్లు తేలింది . మాజీ సీఎం జగన్, డ్రైవర్ సహా పలువురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం అని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
ఇక సింగయ్య మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ బీఎన్‌ఎస్‌లోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని A1గా చేర్చారు. అలాగే వైఎస్ జగన్‌ను A2గా.. అలాగే ఆయనతో ఉన్న జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డిని A3గా, వైవీ సుబ్బారెడ్డిని A4గా, పేర్ని నానిని A5గా, విడదల రజినిని A6గా చేర్చారు. జగన్‌పై నమోదు చేసిన కేసులో బీఎన్‌ఎస్ 105 సెక్షన్ అంటే.. హత్య కిందకు రాని కల్పబుల్ హోమీసైడ్ అని అర్థం. అంటే ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.