Post Office Schemes : గుడ్ న్యూస్‌.. అదిరిపోయే పోస్టల్ స్కీమ్ రూ. 1500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే… చేతికి ఒకేసారి 31 లక్షలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Post Office Schemes : గుడ్ న్యూస్‌.. అదిరిపోయే పోస్టల్ స్కీమ్ రూ. 1500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే… చేతికి ఒకేసారి 31 లక్షలు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :30 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  Post Office Schemes : గుడ్ న్యూస్‌.. అదిరిపోయే పోస్టల్ స్కీమ్ రూ. 1500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే... చేతికి ఒకేసారి 31 లక్షలు...!

Post Office Schemes : డబ్బులు పొదుపు చేయాలి అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. షేర్ మార్కెట్లో కాకుండా
తమకు కచ్చితంగా రాబడి వచ్చే దాంట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు.. అలాంటి వారి కోసమే పోస్ట్ ఆఫీస్ లో మంచి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరంలో కొంత పొదుపు చేసి చివర్లో మంచి లాభం పొందాలనుకునే వారికి కేంద్ర సర్కారు పోస్టల్ శాఖలో మంచి స్కీం ని తీసుకొచ్చింది.ప్రతినెల 1500 రూపాయలు జమ చేస్తే మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత 35 లక్షల రూపాయల పొందే అవకాశం ఉంటుంది.

ఇండియా పోస్ట్ ఇప్పుడు తన గ్రామీణ కార్యక్రమాల్లో భాగంగా గ్రామ సురక్ష యోజన లేదా గ్రామ భద్రత పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీం కింద నెలకు 1500 డిపాజిట్ చేసి పెట్టుబడిదారులు 31 లక్షల నుంచి 35 లక్షల రిటన్ పొందవచ్చు. ఇండియా పోస్ట్ అందించే ఈ స్కీం తక్కువ రిస్క్ తో మంచిరాబడి ఇస్తుంది. గ్రామ సురక్ష యోజనలో భాగంగా 19 ఏళ్ళు పైపడ్డ వారు దీనికి అర్హులు. ఈ స్కీమ్ గరిష్ట అర్హత వచ్చేసి 55 సంవత్సరాలు 10,000 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది.ఈ ప్లాన్ ప్రీమియంను నెలవారీ త్రైమాసికం అర్థ సంవత్సరం లేదా వార్షికంగా చెల్లించే ఛాన్స్ ఉంటుంది. ఒక వ్యక్తికి 80 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు బతికినప్పుడు ఈ పథకం నుంచి వచ్చే డబ్బు ప్రయోజనకరంగా ఉంటుంది.పాలసీ వ్యవధిలో డిఫాల్ట్ అయితే పాలసీదారుడు బకాయి ఉన్న ప్రీమియం చెల్లించి పునరుద్ధరించుకోవచ్చు.

ఈ పథకం ద్వారా రుణ సౌకర్యం కూడా ఉంటుంది. క్లైంట్ మూడేళ్ల తర్వాత పాలసీని సరెండర్ చేయడాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటికి లోబడే మనం రుణం తీసుకోవాలి. ఒక వ్యక్తి 19 ఏళ్ల వయసులో గ్రామ సురక్ష పాలసీ తీసుకుంటే అతని మొత్తం పెట్టుబడి పది లక్షలు అనుకుంటే ఆ ప్రకారం ఆ వ్యక్తి 55 ఏళ్ల వయసు మెచ్యూరిటీ కోసం స్కీం తీసుకుంటే నెలవారి ప్రీమియం వచ్చేసి 1515 రూపాయలు ఉంటుంది. అదే 58 ఏళ్ల వయస్సు మెచ్యూరిటీ కోసం స్కీం తీసుకుంటే నెలవారి ప్రీమియం 1463 రూపాయలు. అదే 60 ఏళ్ల వయసు మెచ్యూరిటీ కోసం స్కీం తీసుకుంటే నెలవారి ప్రీమియం 1411 రూపాయలు. 55 ఏళ్లుగా మెచ్యూరిటీ అయితే ఆ వ్యక్తి 31 లక్షల 60 వేల రూపాయలు పొందుతారు. 50 ఏళ్ల పాలసీకి మెచ్యూరిటీ వచ్చేసి 33 లక్షల 40,000 గా ఉంటుంది. 60 ఏళ్ల మెచ్యూరిటీకి వచ్చేసి 34 లక్షల 60,000 ఉంటుంది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది