Business Idea : ఎప్పటికీ డిమాండ్ ఉండే బిజినెస్… మూడు గంటలు కష్టపడితే చాలు… లక్షల్లో ఆదాయం!
Business Idea : హిందూ సాంప్రదాయాలలో తమలపాకు కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎటువంటి శుభకార్యానికైనా తమలపాకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. అలాగే తమలపాకులను పాన్ లలో బాగా ఉపయోగిస్తున్నారు. అటువంటి తమలపాకులతోనే బిజినెస్ ను చేయవచ్చు. మన ఇండియాలో పాన్ షాపులు బాగా నడుస్తున్నాయి. ఇండియాలో పాన్ బిజినెస్ బాగా జరుగుతుంది. ఈ బిజినెస్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు. రైతుల దగ్గర నుంచి బుట్టలలో తమలపాకులను తీసుకోవాలి. ఒక బుట్ట ధర 300 రూపాయల వరకు ఉంటుంది. ఒక్కో బుట్టలో 600 నుంచి 1000 ఆకుల వరకు ఉంటాయి.
మీరు ఒకవేళ ఈ బిజినెస్ చేయాలనుకుంటే రైతుల దగ్గరికి వెళ్లి ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఈ సంవత్సరం పంటను నాకు సాగు చేసి ఇవ్వండి అని అంటే ఆ రైతు పంటను సాగు చేసి ఇస్తాడు. మీరు దానిని వివిధ షాపులలో విడివిడిగా అమ్ముకోవచ్చు. రిటైలర్ గా అమ్మితే డబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆకులనేవి ఫ్రెష్ గా ఉంటే కస్టమర్లు ఎక్కువగా తీసుకుంటారు. ఆకు అనేది రెండు మూడు రోజులు స్టోర్ చేసుకునే విధంగా ఉంచాలి. ఏదైనా ఫంక్షన్ లకు కూడా ఆర్డర్ ఇవ్వవచ్చు. ఇక తమలపాకుల పెట్టుబడి మీపైనే ఆధారపడి ఉంటుంది. సంవత్సరానికి పంటను తీసుకుంటే పెట్టుబడి ఒకలా ఉంటుంది. బుట్టల లెక్కనా అయితే ఒక రేటు వస్తుంది.
ఈ బిజినెస్ ను పదివేల నుంచి కూడా స్టార్ట్ చేయవచ్చు. పెట్టుబడి పదివేల నుంచి 50 వేల లోపు పెట్టవచ్చు. కానీ లాభాలు మాత్రం కచ్చితంగా ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా బిజినెస్ ని డెవలప్ చేయాలనుకుంటే సిటీలో ఉన్న 10 కిల్లిల షాపులకు తమలపాకు రిటైలర్ గా అమ్మారంటే బిజినెస్ బాగా రన్ అవుతుంది. ఈ బిజినెస్ కి రెండు మూడు గంటలు కేటాయిస్తే చాలు. ఆ తర్వాత వేరే పనిని కూడా చేసుకోవచ్చు. తమలపాకులను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. మీరు రోజుకి రెండు మూడు బుట్టలను అమ్ముకున్న ఈజీగా 600 వస్తాయి. 20,000 స్టాక్ తెచ్చుకుంటే రోజుకి 5000 వరకు మిగులుతాయి.